Malavika Mohanan : పెళ్లి పై నోరు విప్పిన 'రాజా సాబ్' హీరోయిన్.. ఏం చెప్పిందంటే?

మాళవిక మోహనన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని, ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని అడగ్గా..'నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు?’ అని తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

New Update
Malavika Mohanan : పెళ్లి పై నోరు విప్పిన 'రాజా సాబ్' హీరోయిన్.. ఏం చెప్పిందంటే?

Actress Malavika Mohanan : మలయాళ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన మాళవిక మోహనన్.. తలపతి విజయ్ నటించిన 'మాస్టర్ ' సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది. త్వరలోనే 'తంగలాన్' (Thangalaan) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పా. రంజిత్ (Pa. Ranjith) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక, ఒక కాలం నాటి గ్రామీణ నేపథ్యంలోని పాత్రను పోషించింది. చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కాబోతుంది.

ఈ నేపథ్యంలో మాళవిక సోషల్ మీడియా ఎక్స్ వేదికగా .. అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని ఒకరు అడగ్గా..'నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు?’ అని తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. విక్రమ్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది? అని మరో అభిమాని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ..'విక్రమ్‌ అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. ‘తంగలాన్‌’ కోసం తొలిసారి స్టంట్స్‌ చేశా.

Also Read : సెప్టెంబర్ లో సెట్స్ పైకి ‘NTR31’.. తారక్ లేకుండానే షూటింగ్

అది విక్రమ్‌ వల్లే సాధ్యమైంది. నటన విషయంలో సహ నటులకు ఎంతో సాయం చేశారు' అని చెప్పింది. దీంతో మాళవిక కామెంట్స్ నట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హీరోయిన్ 'రాజా సాబ్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనుంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2025 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు