Jaya Sudha: బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్‌లోకి జయసుధ? ప్రముఖ నటి జయసుధ బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనునట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్టీవి ప్రతినిధితో మాట్లాడిన ఆమె.. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపింది. By V.J Reddy 11 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Actress Jaya Sudha: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ బీజేపీకి (Telangana BJP) షాక్ తగలనుందా? అంటే దానికి అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా మరో నేత బీజేపీకి రాజీనామా చేసే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి (Congress Party) రాజీనామా చేసి బీజేపీలో చేరిన ప్రముఖ నటి జయసుధ (Actress Jaya Sudha) ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేయాలనే ఆలోచలనలో ఉన్నట్లు సమాచారం. Also Read: ఇన్ని ప్రమాదాలు వస్తాయని తెలిస్తే మీరు మందు తాగారు! అందుకే రాజీనామా.. గత కొంత కాలంగా నటి జయసుధ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ లో చేర్చుకున్నారు కానీ... ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదంటు కమలం పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పాదయాత్రలో పాల్గొన్న తనకు కనీస సెక్యూరిటీ ఇవ్వలేదు అంటూ బీజేపీ అధిష్టానం పై మండిపడినట్లు తెలుస్తోంది. బీజేపీలో అందుకే జాయిన్ చేసుకున్నారు.. మణిపూర్ అలర్లను దారి మళ్లించేందుకు క్రిస్టియన్ అయిన తనను పార్టీలో చేర్చుకున్నారు అంటూ నటి జయసుధ సంచలన ఆరోపణలు చేశారు. కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందిన తనకు కనీస మర్యాద ఇవ్వకుండా బీజేపీ అవమాన పరుస్తుందంటు బీజేపి పై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లోకి... బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్న నటి జయసుధ త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నట్లు.. కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరువుపుతున్నట్లు వార్తలు వార్తలు జోరందుకున్నాయి. దీనిపై స్పందించిన నటి జయసుధ ఈ నెల ఆఖరి వరకు పార్టీ విధానం మారకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని RTv ప్రతినిధితో మాట్లాడారు. ALSO READ: మేము గెలిచుంటే కేటీఆర్‌ను జైళ్లో పెట్టేవాళ్ళం.. బండి సంజయ్ గరం #telangana-latest-news #actress-jaya-sudha #bjp-shock #jayasudha-to-resign-bjp #jayasudha-to-join-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి