Actress Bhagyashri Borse : ప్లాప్ వచ్చినా తగ్గేదేలే.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ 'మిస్టర్ బచ్చన్' తో డిజాస్టర్ అందుకున్న భాగ్యశ్రీ.. మరో ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానా కీలక పాత్రలో ‘కాంత’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. By Anil Kumar 08 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Actress Bhagyashri Borse : హరీష్ శంకర్ - రవితేజ కాంబోలో ఇటీవల వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది భాగ్యశ్రీ బోర్సే. సినిమా డిజాస్టర్ అయినా.. హీరోయిన్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో ఆమె తన అందం, డ్యాన్స్ తో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అందుకే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న భాగ్యశ్రీ.. తాజాగా మరో బడా ప్రాజెక్ట్ లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అదికూడా దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా లాంటి స్టార్ హీరోల సరసన కావడం విశేషం. దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ అనే సినిమా తెరకెక్కనుంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీలో దగ్గుబాటి రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. Also Read : యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ.. అలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారంటూ తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఇందులో రానా, దుల్కర్ సల్మాన్‌తోపాటు భాగ్యశ్రీ బోర్సే పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ ప్లాప్ వచ్చినా భాగ్యశ్రీ లక్కీ ఛాన్స్ కొట్టేసిందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. #actress-bhagyashri-borse #dulquer-salmaan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి