Geethanjali trailer: గీతాంజలి మళ్లీ వచ్చేసింది.. నవ్విస్తూ, భయపెడుతున్న ట్రైలర్

గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం "గీతాంజలి మళ్లీ వచ్చింది". ఈ సినిమాలో నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నవ్విస్తూ, భయపెడుతున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update
Geethanjali trailer: గీతాంజలి మళ్లీ వచ్చేసింది.. నవ్విస్తూ, భయపెడుతున్న ట్రైలర్

Geetanjali Trailer : నటి అంజలి(Anjali) టైటిల్ రోల్ లో నటించిన చిత్రం గీతాంజలి(Geetanjali). 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అంజలి నటనకు ఉత్తమ నటి అవార్డు వరించింది.

Also Read: Pushpa 2 : బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలే.. పుష్ప 2 టీజర్ డేట్ వచ్చేసింది..!

"గీతాంజలి మళ్లీ వచ్చింది"

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న చిత్రం "గీతాంజలి మళ్లీ వచ్చింది". కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే రాశారు. కోన వెంకట్ ఫిల్మ్ కార్పొరేషన్, MVV సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11 న విడుదల కానుంది.

publive-image

'గీతాంజలి మళ్ళీ వచ్చింది' ట్రైలర్

రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అంజలి, సునీల్, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ సత్య పాత్రలను పరిచయం చేస్తూ ట్రైలర్(Trailer) ను రిలీజ్ చేశారు. భయంభయంగా కనిపిస్తూనే.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఆకట్టుకుంటోంది ట్రైలర్.

publive-image

Also Read: Suriya, Jyotika: జిమ్ లో జ్యోతిక, సూర్య పోటాపోటీ వర్కౌట్స్.. షాకింగ్ వీడియో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jacqueline Fernandez :  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం!

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

New Update
Jacqueline-Fernandez

Jacqueline-Fernandez

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిమ్స్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. మార్చి 26న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జాక్వెలిన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఆనారోగ్యం వలన క్యాన్సిల్ చేసుకుంది.

ముంబైలో కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు

కాగా కిమ్ ఫెర్నాండెజ్ కు మొత్తం నలుగురు సంతానం. కాగా కిమ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల జాక్వెలిన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కిమ్ ఫెర్నాండెజ్ మలేషియా, కెనడియన్ సంతతికి చెందినది, అయితే ఆమె భర్త ఎల్రాయ్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందినవాడు. వీరిద్దరూ1980లలో కిమ్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నారు. ఈ రోజు ముంబైలో కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు జరగనున్నాయి.  

Also Read :  TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

 

Advertisment
Advertisment
Advertisment