Amy Jackson Marriage : పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఇన్స్టాలో పోస్ట్..! నటి అమీ జాక్సన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ''ప్రయాణం ఇప్పుడే మొదలైంది'' అంటూ క్యాప్షన్ పెట్టింది. By Archana 26 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Amy Jackson w/d Ed Westwick : బాలీవుడ్ (Bollywood) నటి అమీ జాక్షన్ (Amy Jackson) రామ్ చరణ్ (Ram Charan) సరసన 'ఎవడు', 'రోబో 2.O', 'నవమన్మదుడు', చియాన్ విక్రమ్ ‘ఐ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలకు దూరమైన ఈ బ్యూటీ ... తాజాగా వివాహం బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, హాలీవుడ్ యాక్టర్ ఎడ్ వెస్ట్విక్ ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వేడుక ఇటలీ (Italy) లోని అద్భుతమైన అమల్ఫీ తీరంలోగ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ విషయాన్ని నటి అమీ జాక్సన్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ''ప్రయాణం మొదలైంది'' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అమీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెండవ వివాహం అయితే అమీ జాక్సన్ కు ఇది రెండవ వివాహం. మొదట ఈ బ్యూటీ జార్జ్ పనయోట్టు అనే బిజినెస్మెన్తో 2019 లో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత అతనితో ప్రేమ ప్రయాణం కొనసాగించిన అమీ పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చింది. చివరికి 2022లో జార్జ్ పనయోట్టు తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎడ్ వెస్ట్విక్ (Ed Westwick) ప్రేమలో పడిన అమీ.. అతనితో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) Also Read: Shraddha Kapoor: ఇన్స్టాలో శ్రద్ధా రికార్డు.. 92.1 మిలియన్ ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్ - Rtvlive.com #ram-charan #amy-jackson-marriage #amy-jackson సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి