Vishwak Sen : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్.. కారణం అదేనా? యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్స్టాలో సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు ఓ స్టోరీ పెట్టారు. ఇప్పుడు అసలు ఇన్స్టాలో అతని అకౌంట్ కనిపించడం లేదు. దీంతో కారణమేంటంటూ అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్లు పెడుతున్నారు. By Anil Kumar 28 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Actor Vishwak Sen Deleted His Insta Account : టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) సోషల్ మీడియా (Social Media) లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటూ తన సినిమా అప్డేట్స్ తో పాటూ కొన్ని సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ ఉంటాడు. అలాగే ట్రోలర్స్ కు ఎప్పటికప్పుడు సాలిడ్ కౌంటర్లు సైతం వేస్తుంటాడు. అలాంటి ఏ హీరో ఇప్పుడు సోషల్ మీడియాకు దూరమయ్యాడు. విశ్వక్ సేన్ తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్ స్టా అకౌంట్ డిలీట్... తాజాగా విశ్వక్సేన్ తన ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టారు. సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇది చూసిన అయన ఫ్యాన్స్ కేవలం కొన్ని రోజులు పోస్ట్లు పెట్టరేమో అని భావించారు. కానీ, ఇప్పుడు అసలు ఇన్స్టాలో అతని అకౌంట్ కనిపించడం లేదు. దీంతో కారణమేంటంటూ ఆయన అభిమానులు ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్లు పెడుతున్నారు. Also Read : దర్శన్ కు సపోర్ట్ గా టాలీవుడ్ హీరో.. కలలో కూడా ఎవరికీ హాని చేయండంటూ పోస్ట్, తిట్టిపోస్తున్న నెటిజన్లు! కారణం అదేనా? ఇదిలా ఉండగా యూట్యూబ్, సోషల్ మీడియాల్లో నెగెటివ్ రివ్యూలు ఇచ్చేవారిపై విశ్వక్సేన్ ఇటీవల ఫైర్ అయిన విషయం తెలిసిందే. దీనిపై తన ఇన్స్టాలో సుదీర్ఘ పోస్ట్ కూడా పెట్టారు. ఓ యూట్యూబర్ ‘కల్కి’ రిలీజ్ కాకముందే రివ్యూ ఇవ్వడంపై ఆయన తప్పు పట్టడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు విశ్వక్ తన ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేయడంతో రీజన్ ఇదే అయి ఉంటుందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు రీజన్ ఏంటో తెలియాలంటే విశ్వక్ సేన్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే. #tollywood #actor-vishwak-sen #vishwak-sen-instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి