Actor Vijay: అభిమానుల అత్యుత్సాహం.. విజయ్ కారు ధ్వంసం..!

సౌత్ సూపర్ స్టార్ విజయ్ కారును ధ్వంసం చేశారు అభిమానులు. సినిమా షూటింగ్ కోసం విజయ్‌ కేరళ వెళ్లారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి హోటల్‌కు వెళ్లేందుకు కారులో బయలుదేరిన విజయ్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ భారీగా తరలిరాగా.. ఈ క్రమంలో ఆయన కారు ధ్వంసమైంది

New Update
Actor Vijay: అభిమానుల అత్యుత్సాహం.. విజయ్ కారు ధ్వంసం..!

Actor Vijay: సహజంగా హీరోలు అంటే అభిమానులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హీరోలు ఎక్కడైనా కనిపించగానే గట్టి గట్టిగా అరిచేస్తూ వాళ్ళ పై అభిమానాన్ని చాటుతుంటారు. ముఖ్యంగా కొంత మంది హీరోల పేర్లు వినగానే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. వాళ్ళు కనిపిస్తే చాలు ఏం చేస్తున్నాము అనే ఆలోచించే స్థితిలో కూడా ఉండరు కొంత మంది అభిమానులు. అలా విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వారిలో సౌత్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ఒకరు .

Also Read: Magadheera: చెర్రీ ఫ్యాన్స్ కు పూనకాలే .. మగధీర రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ప్రేక్షకుల్లో ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. విజయ్ ఎక్కడికి వెళ్లినా.. ఆయనను చూసేందుకు అభిమానులు తరలివస్తుంటారు. అయితే ఈ శృతిమించిన అభిమానం కొన్ని సార్లు ఎదుటివారికి నష్టం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు స్టార్ హీరో విజయ్ విషయంలో కూడా అదే జరిగింది.

publive-image

విజయ్ కారు ధ్వంసం

ఇటీవలే ఓ సినిమా చిత్రీకరణ కోసం కేరళ వెళ్లారు విజయ్. అక్కడ తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి నుంచి హోటల్‌కు వెళ్లేందుకు కారులో బయదేరుతున్న సమయంలో.. ఆయనను చూడడానికి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎలాగైనా తమ అభిమాన నటుడ్ని చూడాలనే కోరికతో ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలో విజయ్ కారు ధ్వంసం అయ్యింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే విజయ్ 'గోట్' మూవీ షూటింగ్ కోసం కేరళ వెళ్లినట్లు సమాచారం.

#VijayStormhitskerala #ThalapathyVijay #TVKVijay Thalapathy Vijay Car broken by rush of huge Kerala fans pic.twitter.com/Vdd9NVO9I9

— Mervin Raj (@MervinR80838445) March 18, 2024

Also Read: Kumari Aunty: ఆ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను .. వైరలవుతున్న కుమారి ఆంటీ ఇంటర్వ్యూ ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు