Bengaluru Bandh: ముదురుతున్న కావేరీ జల వివాదం.. కన్నడిగులకు నటుడు సుదీప్ మద్దతు

కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు.

New Update
Bengaluru Bandh: ముదురుతున్న కావేరీ జల వివాదం.. కన్నడిగులకు నటుడు సుదీప్ మద్దతు

Bengaluru Bandh: కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు బంద్‌కు పిలుపునివ్వడంతో మంగళవారం అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేఏ దయానంద సెలవు ప్రకటించారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అంతిమ సంస్కారం చేస్తూ కన్నడ రైతులు నిరసన వ్యక్తం చేశారు. తాగుకు, సాగుకు నీళ్లు లేని కరవు పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రానికి నీటిని విడుదల చేయవద్దంటూ ఆందోళన తీవ్రతరం చేశారు .సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 15 రోజుల పాటు తమిళనాడు రాష్ట్రానికి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై సిద్ధరామయ్య ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

కన్నడిగులకు నటుడు సుదీప్ మద్దతు..

ఆందోళనల నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. కన్నడ భూమి, నీరు, భాషకు సంబంధించిన అన్ని పోరాటాల్లో నేను ఎప్పుడూ మీతో ఉంటాను అన్నారు. "ఈ ఏడాది వానలు లేకపోవడంతో వ్యవసాయమే కాకుండా తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని.. వర్షాకాలం తప్ప మనకు తాగునీటి వనరులు లేవు. కన్నడిగులు కావేరీ నదిపై ఆధారపడతాం. కరవు అధ్యయనం కమిటీ- కావేరీ కమిటీ సాంకేతిక నిపుణులు కర్ణాటకలో ప్రస్తుత కరవు పరిస్థితుల గురించి ట్రైబ్యునల్ కోర్టును, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఒప్పించాలి. మన నీరు మన హక్కు" అని సుదీప్ పేర్కొన్నారు.

అసలు ఏంటీ కావేరీ జల వివాదం..?

తమిళనాడు-కర్ణాటకల మధ్య సుమారు 130 ఏళ్లుగా కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదం నడుస్తోంది. మైసూరు, మద్రాసు ప్రావిన్సుల మధ్య.. 1892లో ఈ వివాదం ప్రారంభం అయ్యింది. ఆ సమయంలో మైసూరు ప్రాంతంలో.. రాజుల పరిపాలన సాగుతుండగా.. మద్రాస్‌ ప్రావిన్స్‌లో బ్రిటీష్‌ పాలన ఉంది. కావేరీ నది జన్మస్థలం కొడుగు జిల్లా తలకావేరీ. దీని పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళ, పుదుచ్చేరీల్లోనూ ఉంది. కానీ వివాదం మాత్రం ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మధ్యనే రాజుకుంటుంది.

1892లో తొలిసారి మద్రాస్‌- మైసూరుల మధ్య ఒప్పందం..

కావేరీ నదీ జలాలకు సంబంధించి 1892లో తొలిసారి మద్రాస్‌- మైసూరుల మధ్య ఒప్పందం కుదిరింది. నీటి పారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మైసూరు భావించగా మద్రాసు ప్రావిన్సు అంగీకరించలేదు. 1910లో కావేరీ నదిపై ప్రాజెక్టులు నిర్మించేందుకు మైసూరు రాజు సిద్ధమయ్యారు. అయితే మద్రాస్ ప్రావిన్స్ అడ్డు చెప్పడంతో అప్పటి నుంచి వివాదం జరుగుతూనే ఉంది. 1924, 1970ల్లో కూడా పలు ఒప్పందాలు జరిగాయి. చివరగా 1990, జూన్ 2న కావేరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు.

2002లో తారాస్థాయికి చేరిన వివాదం..

2002లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కరువు సంభవివంచడంతో ఇరు రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒప్పందం ప్రకారం నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తమిళనాడు కోరింది. కానీ కర్ణాటక మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో రోజుకు 1.25 టీఎంసీల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీం కర్ణాటకను ఆదేశించింది. తర్వాత సమావేశమైన కావేరీ బోర్డు రోజుకు 0.8 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను కర్ణాటక పాటించలేదు. దీంతో జల వివాదం తీవ్రతరం అయింది. ఇరు రాష్ట్రాలను సినీ నటులు, రాజకీయ నాయకులు రోడ్డెక్కి పోరాటాలకు దిగారు. తర్వాత 2012లోనూ మళ్లీ కావేరీ జలాల వివాదం తలెత్తింది. తాజాగా తమిళనాడుకు 15 రోజుల పాటు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కావేరి బోర్డు ఆదేశించడంతో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం మొదలైంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025 నేటి (ఏప్రిల్ 8) నుంచి అమలులోకి వస్తోందని కేంద్రం ఓ నోటిఫికేషన్ రిలీస్ చేసింది. గతవారం పార్లమెంట్‌ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించాయి. ఆ బిల్లు నేడు రాష్ట్రపతి అమోదం పొందింది. దీంతో వక్ఫ్ భూముల నిర్వాహణలో చాలా మార్పులు వచ్చాయి.

New Update
Waqf Bill

Waqf Bill

Waqf Amendment Act: పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఆమోదించగా.. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయం ప్రకటించలేదు. దీంతో కేంద్రం ఈ అంశంపై క్లారిటీ ఇస్తూ ఈరోజు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు నేటినుంచి (ఏప్రిల్ 8) నుంచి దేశంలో వక్ఫ్‌ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. గతవారం పార్లమెంట్‌ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. కేంద్రం పంపిన వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లును ఏప్రిల్‌ 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లును ఆమోదించారు. 

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

Also read: Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్

రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏప్రిల్ 4న రాజ్యసభ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు రాగా, లోక్‌సభ సుదీర్ఘ చర్చ తర్వాత ఏప్రిల్ 3న బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్‌సబలో 288 మంది ఎంపీలు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. గతంలో ఉన్న చట్టం1995లో సవరించినది. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ఎవరైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతనికి మాత్రమే సొంతమై ఉండాలి. సవరణ చట్టంలో ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధన తొలగించారు. 

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

వక్ఫ్ భూముల సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి కలెక్టర్‌కు బదిలీ చేశారు. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిమేతర సభ్యులను సైతం చేర్చాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయా మాత్రమే అంతిమం కాదు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇకపై వక్ఫ్ బోర్డులకు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండబోదు.

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

Advertisment
Advertisment
Advertisment