/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-67-3.jpg)
Sikandar: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటింస్తున్న తాజా చిత్రం 'సికందర్'. ఏప్రిల్‌లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ సికందర్‌ను ప్రకటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అమీర్‌ఖాన్ హీరోగా నటించిన గజినీ ఫేమ్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలోని సల్మాన్ ఖాన్ కు సమానంగా పోటీ ఇవ్వడానికి కట్టప్ప (నటుడు సత్యరాజ్) ఎంట్రీ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
EID MUBARAK! 🌙🌟
Immerse yourself in the magic of 'Sikandar' as it unfolds on the big screen EID 2025!#SajidNadiadwala Presents @BeingSalmanKhan in and as #SikandarReleasing in cinemas EID 2025 🎬@NGEMovies @WardaNadiadwala #SikandarEid2025 pic.twitter.com/ogMz8kKvIH
— A.R.Murugadoss (@ARMurugadoss) April 11, 2024
విలన్ గా సత్యరాజ్
సికిందర్ సినిమాలోని పవర్ ఫుల్ విలన్ పాత్రకు నటుడు సత్యరాజ్ పేరు పరీశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుందట. అందుకే హీరో ఇమేజ్ కు తగ్గట్లుగా పవర్ ఫుల్ విలన్ ను వెతికే పనిలో ఉన్నారట మేకర్స్. సత్యరాజ్ కంటే ముందు ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామి, కార్తికే పేర్లను కూడా పరిశీలించారుట. ఈ సినిమాలోని మిగతా నటీనటుల గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. తాజాగా, కియారా అద్వానీ కథానాయికగా నటించవచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జూన్ చివరి నుంచి ప్రారంభం కాబోతుంది.
Also Read: Mahesh Babu : ‘తండ్రిగా గర్వపడే రోజు ఇది’.. గౌతమ్ కోసం మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..!