Akash Puri : పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు.. ఏకంగా ఆ పదాన్ని తొలగించి..!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ పేరు మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇకపై తన పేరు ఆకాశ్‌ పూరీ కాదని, ఆకాశ్‌ జగన్నాథ్‌ అని ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

New Update
Akash Puri : పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు.. ఏకంగా ఆ పదాన్ని తొలగించి..!

Actor Akash Puri : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కొడుకు ఆకాశ్‌ పూరి ఇకపై తన పేరును ఆకాశ్‌ జగన్నాథ్‌ అని మార్చుకున్నారు. ఆకాశ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ఇకపై తన పేరు ఆకాశ్‌ పూరీ కాదని.. ఆకాశ్‌ జగన్నాథ్‌ అని ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేర్లు మార్చుకోవడం అనేది కొత్త విషయం కాదు.

కొంతమంది నటులు, నిర్మాతలు తమ కెరీర్‌ను మరింతగా ప్రభావితం చేయడానికి తమ పేర్లను మారుస్తారు. చాలా మంది తమ పాత పేరుతో గుర్తింపు పొందలేకపోవడం వల్ల కొత్త పేరును ఎంచుకుంటారు. కొంతమంది జ్యోతిష్యుల సలహా మేరకు తమ పేర్లను మారుస్తారు. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల తమ పేర్లను మార్చుకోవడానికి ఇష్టపడతారు.

Also Read : రెండో సారి తల్లి కాబోతున్న ‘పవన్’ హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలు!

అయితే ఉన్నట్టుండి ఆకాశ్‌ తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పలేకపోయినా.. సినీ కెరియర్‌ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఆకాశ్‌ పేరు మార్చుకున్న విషయం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఆకాశ్‌ ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోగా.. తన కొత్త పేరుతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాడు. మరి ఈ పేరు మార్పు ఆకాశ్‌ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది? కొత్త పేరుతో ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment