Rape case: మహిళలో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై కన్నేసిన కామాంధుడు.. చివరికీ ఏమైదంటే!

ఒక మహిళతో సహజీవనం చేస్తూ ఆమె ఇద్దరు కూతుళ్లపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డ కేసులో రాజేంద్రనగర్‌ పోక్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు నర్సింహులుకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. బాధిత కుంటుంబానికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది.

New Update
Kakinada: మైనర్ బాలికపై దాడి... పోక్సో కేసు నమోదు..!

Hyderabad: ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై కన్నేసిన కామాంధుడి కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తల్లి బయటపనులకు వెళ్లడం చూసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ నిందుతిడికి పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. చందానగర్‌ ఠాణా పరిధిలో రెండేళ్ల కిందట జరిగిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాసిక్యూటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం నాగులాపురానికి చెందిన నల్లోల నర్సింహులు హైదరాబాద్‌లో నివసించేవాడు. అప్పటికే వివాహమైన ఓ మహిళ తన భర్తకు అనారోగ్యం ఉండటంతో గాంధీలో చేర్పించి చికిత్స చేయిస్తోంది. ఆమెకు నర్సింహులుతో పరిచయం ఏర్పడింది. అతడితో సహజీవనం చేసింది. ఆ మహిళకు 8, 11 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు, ఐదేళ్ల కుమారుడున్నారు. వీరంతా ఒకే గుడిసెలో నివసించేవారు.

అయితే ఆమె లేని సమయంలో ఇంట్లో ఒకరికి తెలియకుండా ఒకరిపై నర్సింహులు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక ఆరోగ్యం క్షీణించగా పక్కనే నివసించే మరో మహిళ ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. విషయాన్ని తల్లికి చెప్పి 2022 జూన్‌ 6న చందానగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయించారు. విచారించిన పోలీసులు సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించారు. ఈ అమానవీయ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాజేంద్రనగర్‌ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఆంజనేయులు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, బాలుడికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు