ACB Raids: హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ రైడ్స్.. ఆ కీలక పోలీస్ అధికారే టార్గెట్?

అక్రమాస్తులు ఉన్నాయన్న సమాచారంతో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఓకే సారి 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఉమా మహేశ్వరరావు విచారణ అధికారిగా ఉన్నారు.

New Update
ACB Raids: హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ రైడ్స్.. ఆ కీలక పోలీస్ అధికారే టార్గెట్?

ACB Raids in Hyderabad: హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ దాడుల కలకలం సృష్టించాయి. CCS ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లోని ఉమామహేశ్వరరావు (Uma Maheswara Rao) ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ జరుగుతున్నాయి. ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఈ దాడులు నిర్వహిస్తోంది. సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వర్ రావు వ్యవహరిస్తున్నారు. గతంలో ఓ కేసు విషయంలో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారని తెలుస్తోంది. ఇంకా CCSలో పలు కీలక కేసులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన అక్రమ ఆస్తులపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: బీజేపీలో నాకు జరిగిన అవమానం ఇదే: జితేందర్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

సీనియర్ IPS ఆంజనేయులు YCP హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైత్వానీని 42రోజు జుడ్యీషియల్ కస్డడీలో చిత్ర హింసలు పెట్టారని ఆమె ఆరోపించారు.YCP లీడర్ కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను వేధించారని తెలిసింది.

New Update
Kadambari Jatwani Case

ఆంధ్రప్రదేశ్ సీనియర్ IPS అధికారి పి.ఎస్.ఆర్.ఆంజనేయులుని ఏపీ పోలీసులు మంగళవారం హైదరాబాదులో అరెస్ట్ చేశారు. ఆయన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కూడా పని చేశారు. నటి జెత్వానీ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే కేసులో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఓ భూవివాదంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టి కాదంబరి జైత్వానీని 42 రోజులపాటు జ్యూడీషియన్ కస్టడీలో ఉంచారు.

Also read : Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

కుక్కల విద్యాసాగర్‌ భూమిని జైత్వానీ ఫోర్జరీ సంతకాలతో వేరే వ్యక్తులకు అమ్మాలని యత్నించారని ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో 2024 ఫిబ్రవరి 2న కేసు పెట్టారు. దానికి 2 రోజులు ముందే (జనవరి 31) అప్పటి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా, డీసీపీ విశాల్ గున్నిలను పిలిపించిన పీఎస్ఆర్ ఆంజనేయులు, ముంబయిలో ఉన్న జత్వానీని అరెస్టు చేసి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. దాదాపు 40 రోజులు కస్టడీలో మానసిక, శారీరక వేధింపుల ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. 2024 మేలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని దక్కించుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన జత్వానీ కేసు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 

Also read: మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

తనతోపాటు తన తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి చిత్రహింసలకి గురి చేశారని జత్వానీ 2024 ఆగస్టు 30న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులోనే ఆమె ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంపై విచారణ తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందింది. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

ఆ నివేదిక ఆధారంగానే గత సెప్టెంబర్‌లో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అప్పటి ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌ ఆంజనేయులు ఆధారాలు లేకుండా అసంపూర్తిగా ఉన్న ఫిర్యాదుతో ఉన్నత హోదాను అడ్డుపెట్టుకొని తప్పుడు ఆదేశాలు జారీ చేశారని తేలింది. ఈ ఆరోపణపై కూటమి ప్రభుత్వంలో ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్‌ జారీ చేసింది. ఏప్రిల్ 22న హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేశారు.

( Kadambari Jatwani Case: | actress-jatwani | IPS officer Anjaneyulu | IPS Anjaneyulu | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment