Tiger Nageswararao: షూటింగ్‌ లో గాయపడ్డ రవితేజ..కాలికి 12 కుట్లు!

మాస్‌ మహారాజ్‌ రవితేజ  (Raviteja) కి షూటింగ్‌ లో కాలికి గాయం కావడంతో 12 కుట్లు వేయించుకుని మరీ షూటింగ్‌ లో పాల్గొన్నడాని చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఇంతకీ అసలు రవితేజకి ఎప్పుడూ గాయం అయ్యింది..ఏ సినిమా షూటింగ్‌ లో ఆయనకు అంత పెద్ద దెబ్బ తగిలింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

author-image
By Bhavana
New Update
Raviteja: ఆమె నటన అంటే పడి చచ్చిపోతా అంటున్న మాస్‌ మహారాజా!

మాస్‌ మహారాజ్‌ రవితేజ  (Raviteja) కి షూటింగ్‌ లో కాలికి గాయం కావడంతో 12 కుట్లు వేయించుకుని మరీ షూటింగ్‌ లో పాల్గొన్నడాని చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ అసలు రవితేజకి ఎప్పుడూ గాయం అయ్యింది..ఏ సినిమా షూటింగ్‌ లో ఆయనకు అంత పెద్ద దెబ్బ తగిలింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ప్రస్తుతం రవితేజ దర్శకుడు వంశీ కాంబినేషన్లో టైగర్‌ నాగేశ్వరరావు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్యూలో అభిషేక్‌ అగర్వాల్‌ రవితేజ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ట్రైన్‌ దోపిడీ సన్నివేశం చేస్తున్నప్పుడు ట్రైన్ మీద నుంచి లోపలి దూకే షాట్‌ ఒకటి ఉంటుంది. ఆ షాట్‌ లో రవితేజ అదుపు తప్పి కిందపడ్డారు. మోకాలికి బాగా దెబ్బ తగిలింది.

Also read: కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. ఆ పార్టీలో చేరే ఛాన్స్?

చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఆయనకు ఆపరేషన్‌ చేసి 12 కుట్లు వేశారు. ఆ షాట్‌ లో సుమారు 400 మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. దీంతో షూటింగ్‌ కానీ వాయిదా వేస్తే నిర్మాతకు చాలా నష్టం వస్తుందని ఆలోచించిన రవి..కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌
కి తిరిగి వచ్చారు.

కాలికి పూర్తిగా దెబ్బ తగ్గే వరకు విశ్రాంతి తీసుకోమని డైరెక్టర్‌ నేను ఎంత చెప్పినా వినకుండా బడ్జెట్ పెరిగిపోతుందని షూటింగ్‌ కి వచ్చేశారు. ఆయనకు అలాంటి డెడికేషన్‌ ఉందని అగర్వాల్‌ అన్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న రవి అభిమానులు ఆయన మీద అభినందనలు కురిపిస్తున్నారు.

ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నూపర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నటిస్తున్నారు. రేణూదేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్‌ 20 న విడుదల కాబోతుంది.

రవితేజ మొదటి సారి పీరియాడిక్ సినిమా చేయడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం, స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తీయడం.. ఇవన్నీ సినిమాపై అంచనాలను నెలకొల్పాయి. ఇక ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment