Ameer Khan: సుప్రీం కోర్టులో అమిర్ ఖాన్ లాపతా లేడీస్..ఎందుకంటే! సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ ను సుప్రీం కోర్టులో శుక్రవారం ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించనున్నారు. By Bhavana 09 Aug 2024 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Ameer Khan: సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ ను సుప్రీం కోర్టులో శుక్రవారం ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించనున్నారు.ఈ ప్రదర్శనకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు కూడా సినిమాని చూడనున్నారు. ఈ సినిమా ప్రదర్శన సమయంలో దర్శకురాలు కిరణ్‌రావు , నిర్మాత అమీర్ ఖాన్ కూడా హాజరుకాబోతున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని సి-బ్లాక్ ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్’ స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను అమిర్ ఖాన్ నిర్మించగా ఆయన మాజీ భార్య కిరణ్‌రావ్ దర్శకత్వం వహించారు. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా కథని ఎంచుకుని, లింగ సమానత్వాన్ని, చాటి చెప్పే కామెడీ డ్రామా ఫిల్మ్ గా దీనిని తెరకెక్కించారు దర్శకురాలు కిరణ్ రావ్. ఈ ఏడాది మార్చి లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలై ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. కానీ ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాలేదు. కొన్ని వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో లాపతా లేడీస్ స్ట్రీమింగ్ చేయగ అత్యధిక వ్యూస్ రాబట్టి టాప్ -1 లో కొనసాగి అద్భుత స్పందన అందుకుంది. మరోవైపు ఈ సినిమాను విడుదలకు ముందుగానే గతేడాది సెప్టెంబరు 8న ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్‌ఎఫ్) వేడుకలో ప్రదర్శించారు. టీఐఎఫ్‌ఎఫ్ కమిటీ సభ్యుల నుండి ప్రశంసలు దక్కించుకుంది లాపతా లేడీస్. #supreme-court #bollywood #kiran-rao #ameerkhan #lapatha-ladies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి