SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీలో 'ఆదిపురుష్' యాక్టర్! రాజమౌళి - మహేష్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో బాలీవుడ్ నటుడు దేవ్ దత్తా నగే నటిస్తున్నట్లు బీ టౌన్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా రాజమౌళితో అతను దిగిన ఫోటో సైతం నెట్టింట వైరల్ గా మారడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. By Anil Kumar 28 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి 'Aadipurush' Actor In SSMB29 : 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత SS రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని రాజమౌళి కూడా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తూనే ఉంటుంది. ఈసినిమా కోసం మహేష్ కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన లుక్ను మార్చుకున్నారు. జుట్టును పెంచారు. దాంతో పాటూ బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీలో పలువురు హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నట్లు రీసెంట్ గా వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ లో ఓ బాలీవుడ్ యాక్టర్ సైతం భాగం కానున్నట్టు తెలుస్తోంది. 'SSMB 29' లో 'ఆదిపురుష్' యాక్టర్ రాజమౌళి - మహేష్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో బాలీవుడ్ నటుడు దేవ్ దత్తా నగే నటిస్తున్నట్లు బీ టౌన్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా రాజమౌళితో అతను దిగిన ఫోటో సైతం నెట్టింట వైరల్ గా మారడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో హనుమంతుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ యాక్టర్ దేవ్ దత్తా నగె.. ఇప్పుడు మరోసారి రాజమౌళి - మహేష్ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సుమారు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలో మహేష్ ఏకంగా ఎనిమిది డిఫెరెంట్ లుక్స్ లో కనిపిస్తారట. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రెండేళ్లకు పైగానే సమయం కేటాయించనున్నారు. #mahesh-babu #ss-rajmaouli #devdatta-nage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి