Apaar Id : ఆధార్ తరహాలో దేశంలో అపార్ కార్డులు...బెనిఫిట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..అర్హులెవరో తెలుసా?

ఆధార్ మాదిరిగానే ఇప్పుడు అపార్ కార్డు అనే మరోకార్డును జారీ చేస్తోంది కేంద్ర సర్కార్.ఈ కార్డు విద్యార్థుల కోసం రూపొందించబడింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో విద్యార్థుల పూర్తి సమాచారం ఉంటుంది.

New Update
Apaar Id : ఆధార్ తరహాలో దేశంలో అపార్ కార్డులు...బెనిఫిట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..అర్హులెవరో తెలుసా?

Aadhaar v/s Apaar : ఆధార్(Aadhaar) వలే  ఇప్పుడు అపార్ కార్డు(Apaar Card) అనే మరో కార్డును జారీ చేస్తోంది కేంద్ర సర్కార్. మరి ఈ కార్డు ఎవరి కోసం జారీచేస్తున్నారు?ఈ కార్డు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశంలో ప్రతిఒక్కరికీ అధార్ కార్డే ఆధారం. ఈ కార్డు ప్రతిఒక్కరికీ చేరువయ్యింది. అదే తరహాలో ఇప్పుడు అపార్ కార్డు అనే మరో కార్డు కూడా జారీ చేస్తోంది కేంద్రం.దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఈ కార్డు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలోనే అపార్ కార్డు ఇస్తున్నారు.(Automated Permanent Academic Account Registry)వన్ నేషన్, వన్ ఐడీ అనే కాన్సెప్టుతో ఈ అపార్ కార్డుల జారీ జరుగుతుంది. ప్రస్తుతం కేంద్రం దీనిపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఈ అపార్ కార్డులను ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ ఈ అపార్ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ వెంటనే చేట్టాలని రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అపార్ కార్డుపై 17అంకెల యూనిక్ నెంబర్ తోపాటుగా క్యూఆర్ కోర్డు కూడా ఉంటుంది. ఇందులో విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ప్రతి విద్యార్థి పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ కార్డులో సేవ్ చేసి ఉంచుతారు. ఈ కార్డులో విద్యార్థి విద్యకు సంబంధించిన పూర్తి డేటా ఉంటుంది. విద్యా నాణ్యాతతో పాటు క్రీడా నైపుణ్యాల గురించి కూడా పూర్తి సమాచారం ఉంటుంది.

విద్యార్థులు ఒక స్కూల్ నుంచి మరోక స్కూల్ కు మారే క్రమంలో ఈ అపార్ కార్డు ఉపయోగపడుతుంది. పలు పాఠశాలల్లో అడ్మిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు ఈ కార్డుతో పనులన్నీ జరుగుతాయి. ఈ అపార్ కార్డు బాధ్యతను నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరంకు సెంట్రల్ గవర్నమెంట్ అప్పగించింది. ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే దీనికి ఛైర్మన్ గా ఉంటారు. అపార్ నెంబర్ నే విద్యార్థి జీవిత కాల ఐడీగా పరిగణించవచ్చు. దీనిపై పూర్తి సమాచారం తొందర్లోనే తెలియనుంది.

ఇది కూడా చదవండి: ఒక వ్యక్తి ఈ ఏడాది స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిన డబ్బుతో డబుల్ బెడ్రూం కొనచ్చట.. ఎలానో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు