Rape case: హైదరాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్.. 4 గంటలు కారులో తిప్పుకుంటూ! హైదరాబాద్ మియాపూర్ JSR గ్రూప్స్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తున్న కడప యువతిపై లైంగిక దాడి జరిగింది. అదే కంపెనీలో పనిచేస్తున్న యువకులు సైట్ విజిట్ పేరుతో తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి 4గంటలపాలు కారులో తిప్పుతూ దారుణానికి పాల్పడ్డారు. By srinivas 03 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో యువతి బలైంది. సైట్ విజిట్ పేరుతో యువతిని కారులో తీసుకెళ్లిన సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఎట్టకేలకు దుర్మార్గులనుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. కడప నుంచి జాబ్ కోసం వచ్చిన యువతి.. బాధితురాలి వివరాల ప్రకారం.. కడప నుంచి జాబ్ కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మియాపూర్ JSR గ్రూప్స్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న యువకులు.. సైట్ విజిట్ పేరుతో కారులో తీసుకెళ్లి దాదాపు నాలుగు గంటలపాలు కారులో తిప్పులూ లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆమె ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నిందుతుల్లో ఒకడైన జనార్ధన్ తోపాటు ఇతరుల నుంచి తప్పించుకుని అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. #hyderabad #young-woman-sexually-assaulted #jsr-groups-sun-city-real-estate-company సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి