Mumbai-Ayodhya: కాషాయ జెండా పట్టిన ముస్లిం యువతి.. ఆ సవాలుతో కాలినడకన ముంబై-అయోధ్యకు

మతాలకు అతీతంగా ఓ యువతి తీసుకున్న ఆదర్శవంతమైన నిర్ణయం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. జనవరిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు ముంబైలోని ముస్లిం మతానికి చెందిన షబ్నమ్‌ అనే యువతి ముంబై-అయోధ్యకు కాలినడకన బయలుదేరింది.

New Update
Mumbai-Ayodhya: కాషాయ జెండా పట్టిన ముస్లిం యువతి.. ఆ సవాలుతో కాలినడకన ముంబై-అయోధ్యకు

Mumbai-Ayodhya : మతాలకు అతీతంగా ఓ యువతి తీసుకున్న ఆదర్శవంతమైన నిర్ణయం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇండియాలో హిందూ-ముస్లింల మధ్య గొడవలు, బీజేపీ ప్రభుత్వం మైనార్టీల పట్ల వివక్ష, వ్యతిరేకతకు చూపింస్తుందనే ఆరోపణలకు సంబంధించిన వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. కాగా వీటన్నింటీ పటాపంచలు చేస్తూ ఓ ముస్లిం యువతి కాషాయ జండా చేతబట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సరయు నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరంలో నిర్మిస్తున్న శ్రీ రామ మందిరంలో వచ్చే నెలలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనులారా తిలకించడానికి కాలినడకన ముంబై నుంచి బయలు దేరింది.

ఈ మేరకు మహారాష్ట్రలోని ముంబైలోని (mumbai) ముస్లిం మతానికి చెందిన షబ్నమ్‌ (Shabnam )అనే యువతి.. శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తి, విశ్వాసాన్ని చూపిస్తోంది. శ్రీరాముడిని పూజించడానికి హిందువుగా ఉండాల్సిన అవసరం లేదని, మంచి మనిషిగా ఉండటమే ముఖ్యమని చెబుతోంది. ఈ క్రమంలోనే జనవరిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు కాషాయ జెండాను ధరించి అయోధ్యకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపింది. తన మిత్రులు రమణ్‌ రాజ్‌ శర్మ, వినీత్‌ పాండేలతో కలిసి ముంబై-అయోధ్యకు 1,425 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నానని ఆమె చెప్పింది. రాముని ఆరాధన ఏ ప్రత్యేక మతం లేదా ప్రాంతానికి పరిమితం కాదని, అది సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నమ్ బలంగా నమ్ముతున్నట్లు పేర్కొంది. 'రాముడు వారి కులం లేదా మతంతో సంబంధం లేకుండా అందరికీ చెందినవాడు' అని షబ్నమ్ యాత్ర వెనుక ఉన్న ప్రేరణ గురించి వివరిస్తోంది. అలాగే అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన ప్రయాణాలు చేయగలరనే అపోహను సవాలు చేయడం కూడా ఆమె లక్ష్యమని పేర్కొంది.

ఇది కూడా చదవండి : Six Guarantees: ప్రజాపాలన.. మొదటి రోజు @7,46,414 దరఖాస్తులు

ఇక ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని సింధవకు చేరుకున్న ఆమె ప్రతిరోజూ 25-30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు చెప్పింది. సుదీర్ఘ తీర్థయాత్రతో అలసట ఉన్నప్పటికీ, తమ ముగ్గురిని రాముడిపై ఉన్న భక్తి కొనసాగిస్తుందని తెలిపింది. ఇక మార్గ మధ్యలో వీరిని కలిసిన పలువురు వాళ్ల ఫొటోలను నెట్టిం షేర్ చేయడంతో వైరల్ అవుతుండగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు