తండ్రి ఉద్యోగం కోసం తనయుడి దారుణం.. కిరాయి గుండాలతో కలిసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏకంగా తండ్రినే చంపేందుకు ప్లాన్ వేశాడు ఓ యువకుడు. కొంతకాలంగా ఖాళీగా ఉంటున్న 25 ఏళ్ల అమిత్.. నాన్న మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని ఆశపడ్డాడు. కిరాయి హంతకులతో రామ్‌జీపై కాల్పులు జరిపించిన ఈ భయంకరమైన ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. By srinivas 21 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం తాను దక్కించుకోవాలనే ఆశతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆయన మరణిస్తే ఆ జాబ్ తనకే వస్తుందని భావించి ఏకంగా కన్నవాడినే ఖతం చేయాలనుకున్నాడు.అవకాశం కోసం ఎదురుచూసి చివరికి అనుకున్నంత పనిచేశాడు. కొంతమంది కిరాయి హంతకులను పెట్టుకుని కాల్పులు జరిపించాడు. ఝార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఈ భయంకరమైన వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మేరకు ఝార్ఖండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌జీ అనే వ్యక్తి రామ్‌గఢ్‌లో కుటుంబంతో నివాసముంటున్నారు. అయితే కొంతకాలంగా సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్(సీసీఎల్)లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం లేని తన 25 ఏళ్ల కుమారుడు అమిత్ ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని అమిత్ ఆశపడ్డాడు. దీంతో తండ్రినే చంపేందుకు పథకం రచించాడు. ఆ పనికి కొంతమంది కిరాయి హంతకులను వినియోగించుకున్నాడు. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన రామ్‌జీపై బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా షాకింగ్ నిజాలు బటయపడ్డాయి. Also read : త్రిష రేప్ సీన్ ఇష్యూపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఏం చెప్పిందంటే ఈ కేసులో భాగంగా కుటుంబ సభ్యులను విచారించగా కుమారుడు అమిత్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. వెంటనే అమిత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. #father #young-man #job #murder-attempt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి