Watch Video: ఈ వీడియో చూస్తే రోడ్డుపై నడవాలంటే భయపడుతారు..!! తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఓ యువతి నిండు ప్రాణాం బలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వీ.సీ సజ్జనార్ ఐపీఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్..అమ్మో రోడ్డుపై నడవాలంటేనే భయం వేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 07 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Tamil Nadu: తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఓ యువతి నిండు ప్రాణాం బలైంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం..ఎప్పుడూ విషాదమే! అభంశుభం తెలియని పాదచారుల బతుకులను ఇలా చిద్రం చేస్తుంది. బాధిత కుటుంబాలకు మానసిక క్షోభను మిగుల్చుతుందని వీ.సీ సజ్జనార్ ఐపీఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతివేగం..ఎప్పుడూ విషాదమే! అభంశుభం తెలియని పాదచారుల బతుకులను ఇలా చిద్రం చేస్తుంది. బాధిత కుటుంబాలకు మానసిక క్షోభను మిగుల్చుతుంది. రెండు రోజుల క్రితం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిందీ ఘోర ప్రమాదం. 👇https://t.co/z7E7RMzcUt#RoadSafety #RoadAccident#Overspeed @MORTHIndia pic.twitter.com/UM1UedmK2D — V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 7, 2023 తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ కారు డ్రైవర్ అతి వేగంగా దూసుకొచ్చాడు. తన ముందు ఉన్న కారుతో పాటు పక్కనే ఉన్న ఓ వ్యక్తిని సైతం ఢీ కొట్టాడు. పెద్ద శబ్దం రావడంతో తిరిగి చూసింది అటు వైపు వెళ్తున్న యువతి. అయితే, ఆ కారు తన వైపు దూసుకొస్తుందని గ్రహించి పక్కకు జరిగేలోపు కారు తనను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యువతి మృతి చెందింది. వెంటనే అప్రమత్తమైన స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు తెలుసుకున్న పోలీసులు బాధిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ కూతురు ఎప్పుడూ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కూతురు మృతి చెందిందన్న వార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్లపై రయ్యి రయ్యి మంటూ..వేగంగా వెళ్లడం కొంతమందికి సరదా. పరిమితికి మించి ప్రయాణిస్తుంటారు..భారీ వాహనాలు ఇష్టానుసారంగా నడిపిస్తుంటారు. గమ్యానికి చేరుకోవాలనే తొందరపాటుతో..వారి కుటుంబాల్లోనే కాకుండా ఇతర కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని నింపుతారు. అతి వేగానికి గమ్యం ఎప్పుడూ విషాదమే అవుతుందని చెబుతున్నా..డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహారిస్తుంటారు. Also Read: 60 ఏళ్ల వృద్ధుడి అరాచకం..ఆపై భయపడి ఏం చేశాడంటే..? #road-accident #tamilnadu #coimbatore మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి