బాత్ రూమ్ లో బిడ్డను కని వదిలేసిన యువతి..చిత్తూరులో దారుణ ఘటన కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన 19 సంవత్సరాల యువతి బాత్ రూమ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను ఎవరికీ తెలియకుండా అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోయింది. By Bhavana 16 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి ప్రపంచంలో పిల్లలు లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా పిల్లల కోసం ఆసుపత్రులు చుట్టూ గుళ్లుగోపురాలు చుట్టూ తిరుగుతు ఉంటారు. అలాంటి వారు మాకు ఎవరో ఒకరు పుడితే చాలు అనుకుంటారు. కానీ కొందరు ఉంటారు..పుట్టిన వారు బరువు అనుకుంటారో..భారం అనుకుంటారో కూడా తెలియదు..రక్తపు మరకలు అరక ముందే పసిపాపలను వదిలేసి పోతుంటారు. అలాంటి దారుణ ఘటనే ఒకటి చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన 19 సంవత్సరాల యువతి బాత్ రూమ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను ఎవరికీ తెలియకుండా అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. 19 సంవత్సరాల యువతి ఒకరు తీవ్రంగా కడుపు నొప్పి వస్తుందని ఓ యువతి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆమెను ఎమర్జెన్సీ వార్డ్ పక్కన ఉన్న బిల్డింగ్ కు వెళ్లి పరీక్షలు చేయించుకుని రావాలని చీటీ రాసి ఇచ్చి పంపారు. అయితే ఆ యువతి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బాత్ రూమ్ లోనికి వెళ్లి అక్కడే బిడ్డను కని వదిలేసి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తరువాత మరికొంత మంది పేషెంట్లు బాత్ రూమ్ కి వెళ్లి చూడగా..అక్కడ రక్తపు మరకలతో ఉన్న బిడ్డను చూశారు. వారు వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించగా..వారు ఆ బిడ్డను ఆసుపత్రి వెంటిలేటర్ లో పెట్టారు. పుట్టిన బిడ్డను వదిలి వెళ్లిన తల్లిదండ్రుల మీద ప్రభుత్వ ఆసుపత్రి తరపున కేసు నమోదు చేయడం జరిగినది. అలాగే డ్యూటీలో ఉన్న వైద్యురాలు యువతిని పరీక్షించకుండా పరీక్షలు చేయించుకోమని పంపడం పై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళ ఫేక్ పేరుతో ఆస్పత్రిలో చేసినట్లు తెలుస్తుంది. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి మహిళను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా ఈ హృదయవిదారక సంఘటన చూసిన అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. #chittor #andrapradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి