లైంగిక దాడికి యువకుడి యత్నం.. నమ్మించి అది కోసేసిన మహిళ ఓ మహిళా యువకుడి మర్మాంగం కోసేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో కలకలం రేపింది. ఒంటరిగా ఉన్నప్పుడు వేధిస్తున్నాడని విసుగుచెందిన ఆమె కూరగాయల కత్తితో కోసేసిన ఆ భాగాన్ని తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. By srinivas 16 Nov 2023 in Uncategorized New Update షేర్ చేయండి మహిళపై లైంగిక దాడి చేయబోయిన యువకుడికి ఊహించని సంఘటన ఎదురైంది. భర్త లేనప్పుడూ ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఎదురుదాడి చేసింది. అవకాశం ఇస్తానని చెప్పి నమ్మించి కూరగాయల కత్తితో అతడి మర్మాంగం కోసేసింది. అంతటితో ఆగకుండా దానిని సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరగగా ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. అయితే ఆమె వద్ద కొంతకాలంగా ఈ యువకుడు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన సదరు మహిళా అతడిని మాటల్లో పెట్టి దాడి చేయకుండా జాగ్రత్త పడింది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి ఒక్కసారిగా నిందితుడి జననాంగాన్ని కోసేసింది. వెంటనే దానిని ఓ సంచిలో తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలి నుంచి తప్పించుకున్న యువకుడు కుటుంబసభ్యుల సహాయంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. Also read : సచిన్ కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా? అయితే ఈ సంఘటనపై స్పందించిన యువకుడు.. నిజంగా తాను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించలేదని చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. బలవంతంగా తన నోట్లో వస్త్రం కుక్కి ఆమె తన ప్రైవేట్ భాగాన్ని కోసేసిందని, లైంగిక దాడి ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని యువకుడు ఖండిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇరువైపుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని మహిళను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకుని మరింత లోతుగా ఈ కేసును పరిశీలిస్తున్నట్లు వివరించారు. #woman #young-man #cuts #penis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి