CRIME : కసాయి భార్య.. ప్రియుడి మోజులో కట్టుకున్నవాడిపై దారుణం ప్రియుడితో కలిసి తన భర్తను ఓ ఇల్లాలు హతమార్చిన ఘటన సిద్దిపేటలో జరిగింది. టీచర్ గా పనిచేస్తున్న వేదశ్రీ ప్రియుడు రమేష్ సాయంతో భర్త వెంకటేశ్ ను ఖతం చేసింది. ఈ హత్యకోసం వ్యాపారి రమేశ్‌తో రూ.18 లక్షల ఒప్పందం కుదుర్చుకుంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 07 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి CRIME : మెడలో మూడుముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచి కాలకాలం తోడుంటానని మాటిచ్చి మనువాడిని వాడిపైనే ఓ భార్య దారుణానికి పాల్పడింది. ఓ బిడ్డ పుట్టిన తర్వాత భర్త మగవాడు కాదని, హిజ్రాగా ప్రచారం చేసి, ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడినే ఖతం చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా గుండెపోటుతో చనిపోయాడని నమ్మించేందుకు ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన భయంకరమైన ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు సీఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట బోయిగల్లీకి చెందిన వేదశ్రీ (Veda sri) కి నాసర్‌పురా వీధికి చెందిన దరిపల్లి వెంకటేశ్ (Venkatesh) తో 2014లో పెళ్లి జరిగింది. 2015లో వీరికి ఒక పాప పుట్టింది. అయితే కొన్నాళ్లకు వెంకటేశ్ అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. క్రమంగా అతని ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకున్నాయి. వెంకటేశ్ హిజ్రాగా మారి రోజాగా పేరు మార్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ దంపతులు ఏడేళ్లుగా దూరంగా ఉంటున్నారు. రూ.18 లక్షల సుపారి.. ఇక కొన్నాళ్లకు తన కూతురును ఇవ్వాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు వెంకటేశ్. వేదశ్రీ టీచర్ గా పనిచేస్తున్న ప్రైవేటు స్కూల్ వద్దకు వెళ్లి ఇబ్బందులకు గురిచేసేవాడు. అయితే వేదశ్రీ కూడా పట్టణానికే చెందిన బోయిని రమేశ్‌తో సన్నిహితంగా ఉంటోంది. దీంతో రమేశ్ తో కలిసి భర్త వెంకటేశ్ అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. ఇందుకు సిద్దిపేటకు చెందిన వ్యాపారి పి.రమేశ్‌తో రూ.18 లక్షల ఒప్పందం కుదుర్చుకుంది. రెండు విడతల్లో రమేశ్ కు రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఇది కూడా చదవండి : Female Condoms: మహిళలకు వేరే కండోమ్ ఉందా? ఫీమేల్ కండోమ్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు! మద్యం తాగించి దారుణం.. అయితే డిసెంబరు 11న నాసర్‌పురాలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటేశ్ కు రమేశ్ స్నేహితుడైన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్ మద్యం తాగించాడు. అక్కడే నిద్రలోకి జారుకున్న వెంకటేశ్ ను మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించేందుకు ప్లాన్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల కేసు దర్యాప్తులో సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. హత్యలో వేదశ్రీతో పాటు మరో అయిదుగురి పాత్ర ఉందని గుర్తించారు. వేదశ్రీ, బోయిని రమేశ్, ఇప్పల శేఖర్‌లను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణంలో స్థానికులను భయాందోళనకు గురిచేసింది. #siddipet #husband #wife-killed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి