కోపంలో భర్తను అక్కడ కొరికిన భార్య.. వెంటపడి మరీ దారుణం

కుటుంబ కలహాలతో ఓ భార్య తన భర్త చెవి కొరికేసిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పూర్తైన తర్వాత భార్యకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

New Update
కోపంలో భర్తను అక్కడ కొరికిన భార్య.. వెంటపడి మరీ దారుణం

ఈ మధ్య కాలంలో చాలామంది క్షణికావేశంలోనే దారుణాలకు పాల్పడుతున్నారు. శత్రవులపైనే కాదు భార్య భర్తలు, పిల్లలు, ఫ్రెండ్స్ పై కూడా కోపంలో దాడులు చేస్తున్నారు. విచక్షణ మరిచి ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇలాంటి ఓ ఆసక్తికరమైన సంఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఒక భార్య ఇంట్లో జరిగిన చిన్న గొడవ కారణంగా కోపంతో రగిలిపోయి తన భర్త సెన్సిటీవ్ పార్ట్ కొరికేసింది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ మేరకు ఢీల్లీలోని సుల్తాన్​పురీ ప్రాంతానికి చెందిన బాధితుడి వివరాల ప్రకారం.. నవంబర్​ 20న ఉదయం 9:20 గంటలకు ఇంట్లోని చెత్త బయటపడేసేందుకు వెళ్లే ముందు నా భార్యతో మాట్లాడాను. ఇల్లు శుభ్రం చేయాలని చెప్పాను. చెత్త పడేసి ఇంటికి వచ్చేసరికి నాతో గొడవ పెట్టుకుంది. ఇందుకు గొడవపడుతోందో కూడా అర్థం కాలేదు. ఇల్లు అమ్మేస్తే వచ్చే డబ్బులు ఇవ్వాలని, పిల్లలతో వేరుగా ఉంటానని చెప్పింది. నేను నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను. కానీ పెద్ద గొడవ మొదలైంది. నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నేను తనని తోసేశాను. ఇంటి బయటకు నడుస్తుండగా.. వెనుక నుంచి వచ్చి నా మీద పడింది. నా కుడి చెవిని గట్టిగా కొరికింది. చెవి పై భాగం దెబ్బతింది. నా కుమారుడు నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చాడు.చెవికైన గాయాన్ని పరిశీలించిన వైద్యులు చెవికి సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు వివరించాడు.

Also read :రైతుబంధు ఆగిపోవడంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే

ఇక ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు బాధితుడినుంచి ఫిర్యాదు కోరగా.. ఆ సమయంలో ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నానని చెప్పినట్లు తెలిపారు. సర్జరీ పూర్తైన తర్వాత తానే వచ్చి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. చికిత్స పూర్తైన తర్వాత ఈ నెల 22, పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన బాధితుడు.. తన భార్యకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు. జరిగినదంతా చెప్పాడు. రిటెన్​స్టేట్​మెంట్​ ఇచ్చాడు. ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకున్నారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు