పాకిస్తాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. 30 మంది దుర్మరణం ప్రపంచంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాల ఘటనలు టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఒక ఘటన మర్వకముందే.. మరో ఘటన చోటుచేసుకుంటుంది. సిగ్నలింగ్‌లో పొరపాటు, పట్టాలు తప్పడం, కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఈ ప్రమాదాలలో ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. ఈ మధ్యనే ఒరిస్సాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 300 మంది మృతి చెందిన ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం రైలు ప్రయాణికులని హైటెన్షన్‌కు గుర్తి చేస్తోంది. By Vijaya Nimma 07 Aug 2023 in ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Train derailed in Pakistan : హజారా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కరాచీ (Karachi) నుంచి రావల్పిండి (Rawalpindi) వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్(Hazara express) 10 బోగీలు పట్టాలు తప్పాయి. నవాబ్‌షా ప్రాంతంలోని సర్హారి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో మరో వంద మందికిపైగా గాయపడ్డారు. రైలులో 17 బోగీల్లో 900 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను రైలు బోగీల నుంచి బయటికి తీసి నవాడ్‌షా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రైలు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రిలీఫ్ రైలును ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపినట్లు ప్రాంతీయ రైల్వే అధికారి ఇలియాజ్ షా తెలిపారు. మృతులు, గాయపడిన వారి గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా సింధ్ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను నిలిపేసినట్లు పాక్ రైల్వే మంత్రి సాద్ రఫీక్ తెలిపారు. సహాయ, ట్రాక్ పునరుద్ధరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా రైల్వే అధికారులు ముమ్మరంగా పనిచేస్తున్నారని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామని పాక్ రైల్వే మంత్రి వెల్లడించారు. రైలు వేగంతో ప్రమాదం హజారా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 1000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని సింధ్ సీఎం సయ్యద్ మురాద్ అలీషా తెలిపారు. రైలు వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉన్నప్పుడు ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. పాకిస్థాన్ ఆర్మీ సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారని పాకిస్థాన్ రైల్వేస్ సుక్కుర్ డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ మొహ్సిన్ సియాల్ తెలిపారు. సహాయక చర్యల్లో సహాయం కోసం అదనపు బలగాలను రప్పించారని తెలిపారు. గాయపడిన వారిని రక్షించేందుకు ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయని తెలిపారు. మెరుగైన సాయం అందించాలి చివరి బాధితుడిని ఆస్పత్రికి తరలించే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణీకులకు మెరుగైన సాయం అందించాలని విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఆదేశించారు. కాలం చెల్లిన ట్రాక్ నిర్వహణ వ్యవస్థలు, సిగ్నల్ సమస్యలు, సాంకేతిక పరికరాలు, పాత ఇంజన్ల కారణంగా పాకిస్తాన్‌లో రైల్వే ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. సింధ్‌లో గతంలో ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. 1990లో సుక్కూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 307 మంది మరణించగా.. 2021లో జరిగిన మరోరైలు ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. మరో 64 మంది గాయపడ్డారు. ఇప్పుడు జరిగిన ఘటనలో 30 మంది మరణించగా.. 100 మందికి గాయపడ్డారు. Also Read: ఘోర రోడ్డు ప్రమాదం…. 24 మంది మృతి….! #pakistan #30-people-died #train-pramadam #hazara-express-train-accident #pakistan-train-accident #train-derailed-in-pakistan #rawalpindi-express #karachi-train-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి