Anantapuram: ఆ జిల్లాలో 500 ఏళ్ల క్రితం నాటి వింత ఆచారం.. అర్థరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి ఏం చేస్తారంటే..?

అనంతపురం జిల్లా తలారిచెరువు గ్రామస్థులు దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి ఓ వింత ఆచారాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు. ప్రతి ఏటా మాఘ పౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. అసలు ఆ గ్రామస్థులు ఎందుకు అలా చేస్తారో ఆర్టికల్ లో తెలుసుకుందాం..

New Update
Anantapuram: ఆ జిల్లాలో 500 ఏళ్ల క్రితం నాటి వింత ఆచారం.. అర్థరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి ఏం చేస్తారంటే..?

Ananthapuram: ఎప్పుడో 500 ఏళ్ల క్రితం ఆచారాన్ని ఆగ్రామస్థులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అర్థరాత్రి నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఇంటికి తాళాలు వేసి పశుపక్ష్యాదులతో సహా ఇంటిల్లిపాది గ్రామం బయటకు వెళ్తారు. అక్కడే వండుకుని సరదాగా గడిపి సూర్యాస్తమయం తర్వాత తిరిగి వస్తారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలనుందా?..

500 ఏళ్ల క్రితం..

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామస్థులు దాదాపు 500 ఏళ్ల క్రితం నుంచి నేటికి ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రతి ఏటా వచ్చే మాఘ పౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తారు. తెల్లవారుజాము నుంచే అవసరమైన వంట సామాగ్రి తీసుకుని ఇళ్లకు తాళాలు వేసి తమ పశుపక్ష్యాదులతో సహా గ్రామాన్ని వదిలి బయటకు వచ్చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు బయటే వంటావార్పు కార్యక్రమం చేసుకుని ఆనందంగా ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత గ్రామానికి వెళ్లి ఎలాంటి దీపాలు వెలిగించకుండా అర్ధరాత్రి వరకు చీకట్లోనే ఉంటారు.

Also Read: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

'అగ్గిపాడు'..

దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఓ బ్రాహ్మణుడు బందిపోట్లతో కలిసి తలారిచెరువు గ్రామంపై పడి ప్రతి ఏటా పండిన పంటలను ఎత్తుకెళ్లేవాడు. బ్రాహ్మణుడి బారి నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు గ్రామస్తులంతా ఏకమై బ్రాహ్మణుడిని హతమార్చారు. అప్పటినుంచి గ్రామంలో పుట్టిన మగ శిశువు పుట్టగానే చనిపోవడం, వర్షాలు లేక పంటలు పండక ఉండటం లాంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారట. ఆ సమయంలో ప్రతి మాఘ పౌర్ణమికి గ్రామంలో నిప్పు వెలిగించకుండా గ్రామం వదిలి దక్షిణం వైపుగా ఉండాలని కొందరు మునులు సూచించారని చెబుతుంటారు. అప్పుడు గ్రామస్తులంతా ఒక ఏడాది అలాగే చేశారు. అప్పటినుంచి గ్రామానికి ఉన్న కీడు తొలగిపోయి మంచి జరగడం ప్రారంభమైందని.. ఇప్పటికీ తరతరాలుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఈ ఆచారానికి వారు 'అగ్గిపాడు'గా పేరు పెట్టుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు