AP : పాపం పసికందు.. నెల్లూరులో దారుణం! నెల్లూరు జిల్లా జోష్యలవారికండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. శిశువు కేకలు వినిపించడంతో స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. By Jyoshna Sappogula 22 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Nellore : మానవత్వం మంట కలిసిపోయింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా (Nellore District) జోష్యలవారికండ్రిగలో ఈ దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన టవల్ లో చుట్టి పడేశారు. Also Read: పేలింది బాయిలర్ కాదు.. ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి సంచలన ప్రకటన! అయితే, అటువైపుగా వెళ్తున్న స్థానికుడికి శిశువు కేకలు వినిపించాయి. వెంటనే పసికందును గుర్తించిన స్ధానికుడు ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) కి తరలించారు. స్థానిక అధికారుల ద్వారా శిశువుకు చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. #nellore #government-hospital #small-baby మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి