Rishikesh : సినిమా స్టైల్లో హస్పిటల్లోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం!

అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రిలోకి పోలీసులు వాహనం ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
Rishikesh : సినిమా స్టైల్లో హస్పిటల్లోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం!

UP : అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రి (Hospital) లోకి పోలీసులు వాహనం (Police Van) ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. సినిమా సీన్‌ (Cinema Scene) ను తలపించే ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ ఆసుపత్రిలో జరిగింది.

ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలిని వేధించాడు. ఆ నిందితుని చర్యను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది డీన్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టి, నిరసనలు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆసుపత్రికి తమ వాహనంలో చేరుకున్నారు. ఈ సమయంలో వారు సినిమా తరహాలో ఒక్కసారిగా పోలీసు జీపుతో సహా ఆసుపత్రిలోకి దూసుకువచ్చారు.

జీపుకు దారి కల్పించేందుకు రోగుల స్ట్రెచర్లను సైతం అడ్డు తొలగించారు. నిందితుడిని అరెస్టు చేశారు. అయితే ఇంతకీ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వాహనంతో సహా లోనికి ఎందుకు వచ్చారన్నది తెలియాల్సి ఉంది.

Also read: డయాబెటిక్‌ పేషెంట్లు రోజులో ఎంత మోతాదులో మామిడిపళ్లను తినాలంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు