West Godavari: తణుకులో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అంతేకాకుండా వారిని విచక్షణారహితంగా కొట్టారు. కేజీపైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. By Vijaya Nimma 13 Sep 2023 in తూర్పు గోదావరి క్రైం New Update షేర్ చేయండి తాళ్లతో కట్టి, కత్తులతో బెదిరించి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అంతేకాకుండా వారిని విచక్షణారహితంగా కొట్టారు. కేజీపైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి తణుకులో చోటుచేసుకుంది. బంగారంతో పాటు లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు దుండగులు. పోలీసులు వివరాల ప్రకారం.. తణుకు నరేంద్ర సెంటర్‌లో రేణుక జ్యూయలరీ పేరుతో నామ్‌దేవ్ వ్యాపారం చేస్తున్నారు. Your browser does not support the video tag. నిర్మానుష్యంగా ఉన్న నరేంద్ర సెంటర్ అయితే.. షాపు మేడపైన రెండో అంతస్తులో నామ్‌దేవ్ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. మంగళవారం ( సెప్టెంబర్ 12)న సెలవు ఉండడంతో షాపులన్నీ బంద్ ఉన్నాయి. ఇదే అదునుగా చూసుకున్న ఐదుగురు దుండగులు రాత్రి 7.30 గంటల సమయంలో ముసుగులు ధరించి నామ్‌దేవ్ ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో నామ్‌దేవ్, అతని భార్య సవిత, కుమారుడు చేతన్ ఉన్నారు. మీగత ముగ్గురు పిల్లలు చైత్ర, శ్రేయ, చేతన ట్యూషన్‌కు వెళ్లారు. 5 నిమిషాల వ్యవధిలో.. ఈ ముసుగు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించారు. టేపుతో వారి కాళ్లు, చేతులు కట్టేశారు. ప్రతిఘటించిన నామ్‌దేవ్‌ను విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్ర గాయాపడ్డాడు. ఇంట్లో ఉన్న లాకర్ తాళాలు తీసుకుని లాకర్ తెరిచారు. అదులో ఉన్న కిలోకి పైగా తాకట్టు బంగారం, రూ.లక్ష నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన కేవలం 15 నిమిషాల వ్యవధిలో పూర్తిచేశారు దొంగలు. అంతనంత కారులో పరారయ్యారు దుండగులు. ఇలా వారు వెళ్తుండగా పలువురు ప్రత్యక్ష సాక్షులు చూశారు. దొంగలు వెళ్లిపోయిన కొద్దిసేపటికి తర్వాత నామ్‌దేవ్ స్థానిక ప్రజలకు సమాచారం ఇచ్చారు. వారందరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లిగూడెం డీఎస్పీ రాజ్‌కుమార్, సీఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ.. తణుకు పట్టణంలోని ప్రధాన కూడలి నరేంద్ర సెంటర్‌లో నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ జరగడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు.ఈ దోపిడీలో ఐదుగురు పాల్గొనగా.. నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా టోల్‌గేట్లను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. అయితే దుండగుల్లో ఓ వ్యక్తి గతంలో నామ్‌దేవ్ దగ్గర పనిచేసిన సూరజ్‌కుమార్‌గా భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు పోలీసులు. #west-godavari-district #tanuku #a-massive-robbery #house-of-a-gold #jeweler మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి