Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు!
తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్‌లో భారీ భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో 9.7 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించగా రాజధాని తైపీలో భవనాలు కంపించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Earthquake: తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు (21.13 మైళ్లు) దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. భూకంపం 9.7 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా భవనాలు ఊగడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Robbery InTemple : అమ్మవారి తాళిబొట్టు తెంచేసి..కాకినాడలో కలకలం..!
ఈ మధ్య కాలంలో గుడి బడి అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన పి. అగ్రహార గ్రామ అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు, తలపై కిరీటాన్ని సైతం దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Robbery InTemple : ఈ మధ్య కాలంలో గుడి బడి అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కనీసం దేవుడనే అనే భయం కూడా లేకుండా అమ్మవారి ఆలయాల్లో చొరబడుతున్నారు. హుండీ సొమ్ములు మాత్రమే కాజేసే దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు, తలపై కిరీటాన్ని సైతం దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా అమ్మవారి నగలు దొంగిలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన పి. అగ్రహార గ్రామముంది. ఆ గ్రామ ఆరాధ్య దేవతగా శ్రీ దుర్గా దేవి అమ్మ వారు పూజలు అందుకుంటున్నారు. మత్స్యకారులతో పాటు సాధారణ ప్రజలు సైతం ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుంటారు. అటువంటి అమ్మ వారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. ఎదురుగా సీసీ కెమెరా ఉంది అని తెలియదో లేక అది నన్నేమీ చేస్తుంది అన్న ధైర్యమో తెలియదు కానీ ఏకంగా అమ్మవారి మూల విరాట్ ప్రాంగణానికి చేరుకున్నాడు.
ఎదురుగా మొత్తం ఏం జరుగుతుంది అన్నది కెమెరా రికార్డ్ చేస్తూనే ఉంది. ముందుగా తన చేతిలో ఉన్న సంచి తీసుకుని పట్టుకున్నాడు. ఆపై అమ్మవారి శిరస్సుపై ఉన్న కిరీటాన్ని తీసి ఆ సంచిలో వేశాడు. తదుపరి పరమ పావనమైన అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు బలవంతంగా లాగాడు. ఇలా రెండు జతల బంగారు సూత్రాలు లాగి ఆ సంచులో వేసుకున్నాడు. అనంతరం అక్కడ నుంచి బయటికి వచ్చి మరల ఏమీ తెలియనట్టు గుడి తలుపులు సైతం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ పరిస్థితులన్నీ సీసీ కెమెరాలో రికార్డు అవుతూనే ఉన్నాయి. ఉదయం గుడికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా అమ్మవారి మెడలో బంగారు ఆభరణాలు కనిపించకపోవడం, తలపై కిరీటం కనిపించకపోవడంతో సీసీ కెమెరా ఓపెన్ చేసి చూశారు. ఇంకేముంది రాత్రి జరిగిందంతా బయటపడింది. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.