Telangana: దారుణం.. మరో లాకప్ డేత్‌.. ఎస్‌ఐ చంపాడంటున్న బంధువులు..

నల్గొండ జిల్లా దేవరకొండలో లాకప్ డెత్ జరగడం కలకలం రేపింది. ఓ భూవివాదం కేసులో అరెస్టైన సూర్య నాయక్ అనే నిందితుడ్ని ఎస్సై సతీష్ రెడ్డి చితకబాదాడంతోనే మృతి చెందాడని.. సూర్య నాయక్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

ఈ మధ్య కాలంలో లాకప్ డెత్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితులను జైలుకు తీసుకొచ్చి కొంతమంది పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తూ వారిని చావబాతున్నారు. దీనివల్ల వారు దెబ్బలకు ఓర్చుకోలేక చనిపోతున్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. అయితే ఇప్పుడు తాజాగా నల్గొండ జిల్లాలోని దేవరకొండలో మరో లాకప్ డెత్‌ జరిగింది. ఆ స్టేషన్ ఎస్‌ఐ విచక్షణారహితంగా కొట్టడం వల్లే నిందితుడు మృతి చెందాడని.. అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం మేరకు ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ముల్ల మధ్య ఓ భూవివాదం తలెత్తింది. అయితే ఈ వివాదంలో ఎస్‌ఐ సతీష్‌ రెడ్డి తలదూర్చాడనే ఆరోపణలు వస్తున్నాయి.

Also read: అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన రేవంత్

కాంగ్రెస్ ఎంపిటీసీ వసంత్ నాయక్ సూచనల మేరకే సూర్య నాయక్‌ అనే యువకుడ్ని పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సతీష్‌ రెడ్డి చితకబాదాడంటూ సూర్య నాయక్ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో అస్వస్థకు గురైన సూర్య నాయక్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీంతో అతడి బంధువులు ఎస్‌ఐ సతీష్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎస్‌ఐ సతీష్‌రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌ ముగిసింది.. ఈరోజు మధ్యప్రదేశ్‌లో సీఎం ఎంపికపై భేటీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు