/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/murder-1-jpg.webp)
Murder in Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ శివాజీ నగర్ లో నడిరోడ్డుపై తన ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రేమోన్మాది. తనను ప్రేమించి పెళ్లి చేసుకో అనగా ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురైన ఆ ప్రేమోన్మాది తనను ప్రేమించి మోసం చేస్తావా అంటూ టైలరింగ్ కు వెళ్లి వస్తున్న ఆ యువతిపై దాడి చేశాడు. అమ్మాయిని గొడ్డలితో నరికి చంపుతుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు స్థానికులు ఆపేందుకు ప్రయత్నించగా.. విచక్షణ కోల్పోయిన ఆ కిరాతకుడు వారిద్దరిపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని దగ్గర లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
పట్టపగలే నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ప్రియుడు
నిర్మల్ - ఖానాపూర్ శివాజీనగర్‌లో పెళ్లికి నిరాకరించిందని అలేఖ్య అనే యువతిని పట్టపగలే ప్రియుడు శ్రీకాంత్ గొడ్డలితో నరికి చంపాడు.. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపైనా దాడి చేయడంతో వారికీ గాయాలయ్యాయి. నిందితుడు శ్రీకాంత్… pic.twitter.com/vZphWKFvIH— Telugu Scribe (@TeluguScribe) February 8, 2024
ఆ అమ్మాయి అక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ ప్రేమోన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.