West Bengal : భారీ పేలుడు...8 మంది దుర్మరణం..!!

పశ్చిమ బెంగాల్‌లో భారీ పేలుడు సంభవించింది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దత్పుకూర్ ప్రాంతంలోని అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. మజ్‌పూర్ జగన్నాథ్‌పూర్ సమీపంలోని ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్యలో బాణాసంచా తయారీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు.

New Update
West Bengal : భారీ పేలుడు...8 మంది దుర్మరణం..!!

West Bengal Explosion:  పశ్చిమబెంగాల్లో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవించింది. నార్త్ 24 పరగణాస్ జిల్లా దత్పుకూర్ ప్రాంతంలోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఈ పేలుడులో 8మంది మరణించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. పేలుడు చాలా బలంగా ఉండడంతో ఆ ప్రాంతంలోని పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. 100 మీటర్ల దూరంలో  మృతదేహాలు ఎగిరిపడ్డాయి.

ఇది కూడా చదవండి:  ప్రాణం తీసిన మైనర్ ప్రేమ..సూసైడ్ నోట్‌లో ఫోన్‌ నెంబర్

ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనలో తీవ్రగాయాలైన వారిని బరాసత్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉదయం 8:00 గంటల ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇంతకు ముందు కూడా  ఎగ్రాలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా గ్రామస్తులు పోలీసులపై దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్యలో అక్రమంగా బాణాసంచా తయారీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

రద్దీగా ఉండే ప్రాంతంలో బాణాసంచా ఫ్యాక్టరీ ఎలా నడుస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తూర్పు మేదినీపూర్ జిల్లాలోని ఎగ్రాలో ఇంతకుముందు అక్రమ బాణసంచా ఫ్యాక్టరీ పేలిందని, ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా...పలువురు గాయపడ్డారు. ఈ కేసులో నిందితులను కూడా అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: ఓ వైపు చంద్రుడిపై ఆరాటం..మరోవైపు విషసర్పాలతో పోరాటం..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు