ఇజ్రాయల్ కు హర్యానా యువకులు..జీతం రూ1.37వేలు

ఇజ్రాయెల్ లో ఉద్యోగాల కోసం హర్యానా నుంచి 530 మంది యువకులు వెళ్లారు. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన హర్యానా ప్రభుత్వానికి వారు కృజ్జతలు తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకోవటంతో అక్కడ ఉద్యోగుల కొరత ఏర్పడింది.

New Update
ఇజ్రాయల్ కు హర్యానా యువకులు..జీతం రూ1.37వేలు

530 మంది యువకుల బృందం హర్యానా నుండి ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల కోసం బయలుదేరింది. ఈ యువతను హర్యానా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  రోహ్‌తక్‌లో  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసింది. మంగళవారం ఆ యువకులు న్యూఢిల్లీ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఇజ్రాయెల్ వెళ్లే ముందు సీఎం నయాబ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఆ యువకులతో మాట్లాడారు.

ఇజ్రాయెల్‌లో హర్యానా ప్రభుత్వంకు సంబంధించిన కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి.ఈ క్రమంలో, ఇజ్రాయెల్ లో ఉద్యోగవకాశాల పేరిట రిక్యూర్ మెంట్ నిర్వహించింది. జనవరి నెలలో రోహ్‌తక్‌లో ఆరు రోజుల పాటు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ సమయంలో 8199 మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం రోజు ఇజ్రాయలుదేరే ముందు యువత హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ కూడా యువతను అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కూడా యువతతో మాట్లాడి రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చేలా యువత కృషి చేయాలని అన్నారు.

ప్రస్తుతం ఇజ్రాయెల్ ,హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. భారత్ నుండి కార్మికులను పంపాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం కోరింది. ఇజ్రాయెల్ కు ప్రస్తుతం 10,000 మంది నిర్మాణ కార్మికులకు డిమాండ్ ఉంది. వీటిలో ఫ్రేమ్‌వర్క్, షట్టరింగ్, కార్పెంటర్, ప్లాస్టరింగ్, సిరామిక్ టైల్, నూలు పరుపులను పనిచేయటానికి  కార్మికులు కావాలి . ఇక్కడ పనిచేయటానికి వచ్చిన కార్మికులకు నెలకు రూ.1,37,000 జీతం వరకు ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి 10 వ తరగతి అర్హత ,వృత్తిలో మూడేళ్ల పాటు అనుభవం..వయస్సు 25 నుంచి 45 ఏళ్లుగా ఉన్నవారిని ఉద్యోగానికి అర్హులు గా ప్రకటించారు. దీంతో పాటు వైద్య బీమా, ఆహారం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. వీరు ప్రతి నెలా రూ.16,515 బోనస్ కూడా పొందుతారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్.. భారత్, చైనా దోస్తీ

ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.

New Update
Trump and Jinping

Trump and Jinping

వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీసా రూల్స్‌ను ఆయన మరింత కష్టతరం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రతీకార సుంకాలతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ అవకాశాన్ని  చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు వీసా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.  

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

అంతేకాదు భారత పౌరుల కోసం చైనా చాలావలకు వీసా సడలింపులు చేసింది. ఆ దేశాన్ని ప్రయాణాన్ని మరింత ఈజీగా చేసింది. భారతీయులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా వీసా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ రోజులు చైనాలో ప్రయాణించే వాళ్లకి బయోమెట్రిక్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇది వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.  

చైనా వీసా తక్కువ ధరకు దొరకడం వల్ల భారతీయలకు ప్రయాణం మరింత సులవుగా మారింది. వీసా జారీ చేసేందుకు పట్టే సమయాన్ని కూడా తగ్గించేశారు. ఇది వ్యాపార,విహార యాత్రకు వెళ్లేవాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చైనా, భారత పర్యాటకులకు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, పర్యాటక ప్రదేశాలను ఇది ప్రోత్సహిస్తోంది. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ట్రేడ్‌వార్ మొదలుపెట్టారు. దీంతో చైనా భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు ద్వైపాక్షిక లాభాలపై ఆధారపడి ఉన్నాయని చైనా దౌత్యవాణిజ్య ప్రతినిధి యూ జింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' చరిత్రలో ప్రతీకార సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో ఎవరూ గెలవలేదు. ప్రపంచ దేశాలు అన్నీకలిసి సంప్రదింపులు, బహుళపక్ష సూత్రాలపై నిలపడి ఏకపక్ష చర్యలు, రక్షణవాద విధానాలకు వ్యతిరేకంగా ఉండాలని'' అన్నారు.  

 rtv-news | trump | china | national-news 

Advertisment
Advertisment
Advertisment