Crime : ముదిరిన మూఢ నమ్మకం.. పాము కాటుకు చనిపోయిన వ్యక్తిని గంగా నది ప్రవాహంలో వేలాడదీసి...!

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు గంగా నదిలో రెండు రోజుల పాటు వేలాడదీశారు. గంగానదిలో ఉంచితే విషం పోతుందని కొందరు చెప్పడంతో వారు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

New Update
Crime : ముదిరిన మూఢ నమ్మకం.. పాము కాటుకు చనిపోయిన వ్యక్తిని గంగా నది ప్రవాహంలో వేలాడదీసి...!

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పాము కాటు(Snake Bite) కు గురై చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు గంగా నదిలో రెండు రోజుల పాటు ఉంచారు. గంగానది(Ganga River) లో ఉంచితే విషం పోతుందని కొందరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..

Also Read: వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ.. 108లో విజయవాడకు తరలింపు..!

20 ఏళ్ల మోహిత్ కుమార్‌(Mohit Kumar) అనే వ్యక్తిని పొలంలో పాము కాటేసింది. కుటుంబసభ్యులు వెంటనే మోహిత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందాడు. కానీ, పాము కాటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ప్రవహించే గంగానదిలో ఉంచితే విషం పోతుందని కొందరు వ్యక్తులు ఆ బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు.

Also Read: రోజాని.. భర్త భరించలేకే వేరే ఉంటున్నాడు.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!

దీంతో, మోహిత్ బతుకుతాడనే నమ్మకంతో కుటుంబ సభ్యులు యువకుడి మృతదేహాన్ని రెండు రోజుల పాటు గంగా నదిలో తాడు కట్టి వేలాడదీశారు. అయితే, రెండు రోజులుగా మృతదేహాన్ని అలా వేలాడదీసినా ఎలాంటి చలనం లేకపోవడంతో యువకుడి మృతదేహన్ని బయటకు తీసి దహనం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియో(Social Media) లో వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు