Nandyala: బన్నీకి బిగ్ షాక్.. నంద్యాలలో కేసు నమోదు! నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. నంద్యాల టూ టౌన్ పిఎస్ లో Cr. No.71/2024.U/s 188IPC సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు. By srinivas 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Case Filed Against Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీర్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల టూ టౌన్ పిఎస్ లో Cr. No.71/2024.U/s 188IPC సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నంద్యాలలో ఎలక్షన్ కోడ్ (Election Code) అమలులో ఉన్నప్పటికీ నంద్యాల వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravichandra Kishore Reddy) గారి నివాసానికి రావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బన్నీని చూడటానికి ప్రజలు వేలాదిగా రావడంతో స్థానికులు ఇబ్బంది పడ్డట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ 31 ఏపీ యాక్ట్ , సెక్షన్ 144 అమలులో ఉన్నందున నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాదిమందిగా కలవడం నేరమని ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పిఎస్ లో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్ (Allu Arjun) పై కేసు నమోదు చేశారు. #ap-elections-2024 #allu-arjun #nandyala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి