Jagtial : ప్రేయసిని చంపేందుకు వచ్చిన యువకుడిని కొట్టి చంపిన బంధువులు!

ప్రేమపేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమ్మాయిపై దాడి చేసేందుకు ఇంటికొచ్చిన మహేశ్ ను ఆమె కుటుంబసభ్యులు కొట్టి చంపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరిగింది.

New Update
Jagtial : ప్రేయసిని చంపేందుకు వచ్చిన యువకుడిని కొట్టి చంపిన బంధువులు!

Crime : జగిత్యాల జిల్లా(Jagtial District) లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ(Love) వ్యవహారంలో ఓ యుకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి వచ్చిన యువకుడిని ఆమె కుటుంబసభ్యులు కొట్టి చంపారు. ఈ ఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరగగా స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

మూడేళ్లుగా వేధింపులు..
ఈ మేరకు మల్యాల సీఐ దామోదర్‌రెడ్డి(CI Damodar Reddy) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన భోగ మహేశ్‌ అనే యువకుడు మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్నాడు. సదరు యువతి మహేశ్‌(Mahesh) వేధింపులకు సంబంధించి అతని కుటుంబీకులకు చెప్పింది. మల్యాల పోలీస్‌స్టేషన్‌(Mallial Police Station) లో మార్చి 2న ఫిర్యాదు కూడా చేసింది. దీంతో మరింత రగిలిపోయిన మహేశ్.. ఎలాగైనా యువతిని దక్కించుకోవడమో లేక చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు మార్చి 6న ఆమె బర్త్ డే(Birthday) ను డెత్ డే(Death Day) గా మారుస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే కత్తి పట్టుకుని యువతి ఇంటికి చేవచ్చి గొడపపెట్టుకున్నాడు. ఈ క్రమంలో యువతి కుటుంబీకులతో ఘర్షణ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన మహేశ్ యువతి తల్లి సత్తవ్వ, తాత నరసయ్యపై కత్తితో దాడి చేశాడు.

ఇది కూడా చదవండి : Accident: పెళ్లి ఇంట విషాదం.. కారు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం!

ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి..
అయితే తమను తాము కాపాడుకునే క్రమంలో యువతి కుటుంబీకులు మహేశ్‌ తలపై బండరాయితో కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. మహేశ్‌ దాడిలో తీవ్ర గాయాలకు గురైన ఇద్దరిని 108లో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు మల్యాల సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్‌ఐ అబ్దుల్‌ రహీం తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment