రూ.350 కోసం మర్డర్ చేసిన బాలుడు.. శవం ముందే డాన్స్‌ చేస్తూ

రూ.350 కోసం ఓ బాలుడు ఒక యువకుడిని హత్య చేసిన భయంకరమైన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వెల్‌కమ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి నడిచివెళ్తున్న వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడిచేసి చంపేసిన నిందితుడు శవంముందే డ్యాన్స్ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
రూ.350 కోసం మర్డర్ చేసిన బాలుడు.. శవం ముందే డాన్స్‌ చేస్తూ

ఈ మధ్య చిన్న చిన్న అవసరాలకోసం కూడా గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు దారుణంగా మర్డర్లు చేస్తున్న సంఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. డబ్బులు, సెల్ ఫోన్లు, బంగారం వంటి తదితర విలువైన వస్తువులను దొచుకునే క్రమంలో అమాయకుల ప్రాణాలు తీసేందుకు దొంగలు వెనకాడట్లేదు. ఇలాంటి ఓ దారుణమైన ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. కేవలం మూడు వందలకోసం ఓ బాలుడు యువకుడి ప్రాణం తీసిన భయంకరమైన వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also read :అది నా అకౌంట్ కాదు.. ఎందుకు క్రియేట్ చేశారో తెలుసు.. సారా ఎమోషనల్

ఈ మేరకు ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీలో వెల్‌కమ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి కేవలం రూ.350 కోసం ఓ బాలుడు ఒక యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెల్‌కమ్‌ ప్రాంతంలో దారిన వెళుతున్న యువకుడిపై ఒక బాలుడు దాడికి దిగాడు. విచక్షణ రహింతగా అటాక్ చేసి బాధితుడికి ఊపిరాడనివ్వకుండా చేశాడు. ఈ క్రమంలోనే స్పృహ కోల్పోయిన యువకునిపై తన వద్ద ఉన్న కత్తితో దాదాపు 60 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.350 నగదు తీసుకొన్న పిల్లవాడు కొద్దిసేపు మృతదేహం దగ్గరే డాన్స్‌ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ దారుణమంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయింది. సమాచారం అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇక ఈ దారుణానికి పాల్పడిన బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తితో నిందితుడికి గతంలో ఎలాంటి పరిచయం లేదని, కేవలం డబ్బు కోసమే ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తెలినట్లు వెల్లడించారు. ఇక ఈ ఘటన వెల్‌కమ్‌ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేయగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే ఫ్యామిలీలో ఎనిమిది మంది మృతి!

మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. నోహటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

New Update
road-accident mp

road-accident mp

మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. నోహటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సిమ్రి గ్రామ సమీపంలోని సునార్ నది వంతెన సమీపంలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో  వంతెనపై నుంచి వాహనం నదిలోకి పడిపోయింది.  పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారం  ప్రకారం, వాహనంలో ఉన్నవారంతా జబల్పూర్ జిల్లా నివాసితులు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సోదరీమణులు, ఒక మేనకోడలు, మనవడు ఉన్నారు.

Also read :  మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే 

వాహనంలోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు దామోహ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.   గాయపడిన ప్రయాణికులకు దామోహ్‌లో చికిత్స అందించి, త్వరిత వైద్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా జబల్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు.  కుటుంబం ఇంత పెద్ద సంఖ్యలో కలిసి ప్రయాణించడానికి గల కారణం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read : కొంపముంచిన ఖలేజా టైటిల్.. అత్యాశకు పోతే రూ .10 లక్షలు బొక్కా

కాగా సోమవారం మధ్యప్రదేశ్ అంతటా మూడు వేర్వేరు ప్రమాదాలు సంభవించి మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయింది. సోమవారం జబల్పూర్-రైసెన్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  

Also Read: జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !

Also Read: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు