Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే! తిరుపతి జిల్లా మూలకండ్రిగలో 6ఏళ్ల బాలికను 65ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటిదగ్గర ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి బలరామయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక చికిత్స పొందుతుండగా పరారిలోవున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Tirupathi: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మూలకండ్రిగలో 6 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్దుడు అత్యాచారాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజులాగే గత ఆదివారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. అయితే ఇంటి దగ్గర ఒంటరిగా ఆడుకుంటున్న బాలికతో మెళ్లగా మాటలు కలిపిన అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల బలరామయ్య అనే వృద్దుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి.. ఆమెకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి తన వెంట తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో నొప్పితో బాధపడుతున్న బాలికను పేరెంట్స్ స్థానిక ఆర్.ఎం.పి డాక్టర్ దగ్గర చూపించగా కుదుటపడలేదు. రెండు రోజులైనా నొప్పి తగ్గక పోవటంతో రేణిగుంటలోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పరారీలోవున్న బలరాయమ్మ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు #tirupati సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి