BIG BREAKING: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. పనిచేయని సర్వర్

గడిచిన పదేళ్లుగా ఎంతో ఎదురు చూసిన నిరుపేద కుటుంబాలకు రేషన్‌కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కానీ అంతలోనే షాక్ తగిలింది. ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలు సర్వర్ ఓపెన్ కాక నిరాశతో వెనుతిరిగారు.

New Update
ration

Ration Cards : గడిచిన పదేళ్లుగా ఎంతో ఎదురు చూసిన నిరుపేద కుటుంబాలకు రేషన్‌కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కానీ అంతలోనే షాక్ తగిలింది.ఆన్‌ లైన్‌ ద్వారా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని మీసేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలకు ఊహించని షాక్‌ తగిలింది.  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2021 ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ లాగిన్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కొత్తగా రేషన్‌ కార్డులు తీసుకోవాలనుకున్నవారికి, కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్న వారికి సర్వర్ ఓపెన్ కాక నిరాశే మిగిలింది.

Also Read :  కుంభమేళాలో కాసుల వర్షం.. టీ అమ్ముతూ రోజుకు రూ.15వేలు, బొట్టు పెడుతూ రూ.20వేలు: ఐడియా అదుర్స్!

అయితే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు ఆన్‌లైన్‌ ఎఫ్ ఎస్ సి లాగిన్ పునరుద్ధరణకు పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కార్డుల కోసం దరఖాస్తు చేసుకుందామని వెళ్లినవారికి మాత్రం నిరాశ తప్పలేదు. పౌర సరఫరాల అధికారుల ఆదేశాలు నేటి నుండి మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ఐటీ 2/2196/2025 ద్వారా ప్రకటించింది. అయితే పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కొత్త రేషన్ కార్డులు మీసేవ కేంద్రాల ద్వారా తీసుకోవడం లేదని కిందిస్థాయి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. 

ఇది కూడా చదవండి: Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!


ఈ క్రమంలో మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం చాలా మంది లబ్ధిదారులు వెళ్లగా.. వారికి నిరాశే మిగిలింది. ప్రజలు మీ సేవా సెంటర్ కు వెళ్లే సర్వీస్ అందుబాటులో లేదని చూపించడంతో కాస్త ఆందోళనకు గురయ్యారు. ఎందుకని మీ సేవా నిర్వాహకులకు కూడా తెలియడం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళినవారు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనువు తిరుగుతున్నారు అయితే ఈ ప్రక్రియ మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే జనవరి 26న తెలంగాణా ప్రభుత్వం కొత్త కార్డుల జారీ ప్రారంభించింది. ఇప్పటికే పలు గ్రామాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి, మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవటం కోసం వెళ్ళిన వారికి ఇస్తున్న షాక్ తో ప్రజలు ఖంగు తింటున్నారు.

Also Read: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!

ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసిందని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని పలు వెబ్‌సైట్‌లు ప్రముఖంగా వెలువరించాయి. కూడా అయితే ఈ విషయంపై వస్తున్న వార్తలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. రేషన్‌ కార్డుల దరఖాస్తులు ఆపాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని వస్తున్న వార్తలు అవాస్తమని.. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు