ఔరంగజేబు సమాధి ఎందుకు తొలగించాలి.. అసలు వివాదానికి కారణమేంటి?

ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ కొందరు నిరసనలకు పాల్పడటంతో నాగ్‌పూర్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంభాజీని ఔరంగజేబు చంపాడని, హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు ఉన్నాయి. ఈ కారణంతో సమాధి తొలగించాలని నిరసనలు మొదలయ్యాయి.

New Update
Nagpur Violence

Nagpur Violence Photograph: (Nagpur Violence )

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్తలు నాగ్‌పూర్‌లో మహల్ ఏరియాలో నిరసనలు చేపట్టారు. ఓ వర్గానికి చెందిన యువకులు వీరిపై రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయి.

ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

హింసాత్మకమైన ఘటనలు..

ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మొదలు పెట్టారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలను ధ్వంసం చేసి, వాటికి నిప్పు అంటించారు. హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నాగ్‌పూర్‌లో అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు మొత్తం 39 మందిని అరెస్టు చేశారు. అయితే వివాదానికి కారణం ఔరంగజేబు సమాధేనా? ఎందుకు ఔరంగజేబు సమాధి తొలగించాలనే విషయాలు తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

ఇటీవల బాలీవుడ్‌లోఛత్రపతి మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా వల్లే నాగ్‌పూర్‌లో వివాదం చెలరేగింది. ఔరంగజేబ్ సమాధి టాపిక్‌పై వివాదం మొదలైంది. ఔరంగజేబు మరాఠా పాలకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను ఉరితీయడం, హిందూ దేవాలయాలను కూల్చివేయడం వంటివి ఉన్నాయి.

వీటి కారణాల వల్లే ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేయాలంటూ కొందరు నిరసనలు చేపట్టారు. దీంతో పాటు ముస్లింల పవిత్రమైన ఖురాన్‌ను కూడా కాల్చివేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అల్లర్లు చెలరేగాయి. ఔరంగజేబు సమాధి ఉండే స్థలానికి భద్రతను కఠినతరం చేశారు. ఎవరిని కూడా అక్కడికి పంపించడం లేదు. సందర్శకుల ఐడీ అన్నీ చూసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఔరంగజేబు సమాధి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు