AP News : ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ.!

ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ సర్కార్ వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్ టైం సెటిల్ మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనున్నట్లు సమాచారం. ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం మార్చి 31వరకు వర్తించనుంది.

New Update
AP News : ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ.!

ఏపీలో 2023-2024 వరకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒకే విడత కింద వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. 2024 మార్చి 31 లోపు పన్ను ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లిస్తేనే వడ్డీ మాఫీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో వడ్డీ చెల్లించి ఉన్నట్లయితే పన్నుల్లో సర్ధుబాటు చేస్తామని స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో ఇబ్బందులపై క్రెడాయ్ వంటి అసోసియేషన్ల విజ్నప్తుల మేరకు వడ్డీ మాఫీ చేస్తున్నట్లు పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ సర్కార్ వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్ టైం సెటిల్ మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనున్నట్లు సమాచారం. ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం మార్చి 31వరకు వర్తించనుంది.

ఇది కూడా చదవండి:  ఓపీఎస్‌ అమలు చేయకుంటే రైలు సేవలు నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక

Advertisment
Advertisment
తాజా కథనాలు