Aadhar Data haked:అమ్మకానికి 81.5 కోట్ల ఇండియన్ ఆధార్ వివరాలు..డేటా హ్యాక్ టెక్నాలజీ పెరుగుతోంది....దాంతో పాటూ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఆ నేరాల్లో కూడా హద్దులు మీరిపోతున్నారు. మొన్నటివరకూ ప్రభుత్వ వెబ్ సైట్లను, ఇతర విషయాలను హ్యాక్ చేశారు. ఇప్పుడు మాత్రం ఏకంగా భారతీయుల ఆధార్ వివరాలే హ్యాక్ చేసిపడేశారు. అది కూడా 81.5 కోట్ల ఇండియన్స్ వివరాలు డార్క వెబ్ లో లీక్ అయిపోయాయి. By Manogna alamuru 31 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి భారతీయుల ఐడెంటిటీ అని చెబుతున్న ఆధార్ వివరాలు లీక్ అయ్యాయని తెలిపింది అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రిసెక్యురిటీ. మొత్తం 81.5 కోట్లమంది ఇండియన్స్ ఆధార్ వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో పేర్లు, వయసు, ఆధార్ నంబర్, పాస్ పోర్ట్ వివరాలు, మొబైల్ నెంబర్స్ లాంటివి ఉన్నాయి. అక్టోబర్ 9న pwn0001 పేరు కలిగిన హ్యాకర్ భారతీయుల ఆధార్, పాస్ పోర్ట్ రికార్డ్స్ పొందినట్లు రిసెక్యూరిటీ సంస్థ తెలిపింది. పైగా దీన్ని 80వేల డాలర్లకు అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు హ్యాకర్. ఇతను హ్యాక్ చేసిన వివరాలు అన్నీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ దగ్గర ఉన్న భారతీయులకు సంబంధించినవి అని తెలుస్తోంది. దీని మీద సీబీఐ దర్యాప్తు చేస్తోంది. Also read:హిట్ మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డ్..ఒకే ఒక్క కెప్టెన్ భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైనది. ఇండియాలో ఏ పని జరగాలన్నా ఇది కచ్చితంగా ఉండాల్సిందే. దీంతో లింక్ అయ్యే బ్యాంక్ అకౌంట్లు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ అన్నీ ఉంటాయి.అలాంటి ఆధార్ కార్డ్ డేటా చోరీ అయితే ఇంక అంతే. మన వివరాలు అన్నీ వేరే వాళ్ళ గుప్పిట్లో ఉన్నట్టే. ఇది నేరగాళ్ళ చేతిలో పడితే కోట్ల సంపద వాళ్ళ సొంతం అవుతుంది. అంతేకాదు బ్యాంక్ దోపిడీలు, రిఫండ్ మోసాలు, ఆర్ధిక నేరాలు జరుగుతాయి. అయితే డేటా చోరీ అవ్వడం మన దేశంలో ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా జరిగాయి. గతంలో కోవిడ్ వెబ్ సైట్ నుంచి వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయుల వివరాలు చోరీ చేశారు. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్ ఔట్ పేషంట్ విభాగంలో రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. అయితే ఈ సారి వాటన్నింటికన్నా ముఖ్యమైనది ఆధార్ కార్డ్ డేటా చోరీ అయింది. ఇది చాలా పెద్ద విషయం. అందుకే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు సీబీఐ. #theft #data #aadhar #haked #leak మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి