మోడీపై 80 శాతం మందికి పాజిటివ్ కార్నర్ ... పీఈడబ్ల్యూ సర్వేలో ఆసక్తికర విషయాలు...!

పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు పదేండ్ల పాలన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు సానుకూలంగా వున్నట్టు సర్వే పేర్కొంది. దేశంలో 80 శాతం ప్రజలు ప్రధాని మోడీ పట్ల సానుకూలమైన అభిప్రాయాన్ని కలిగి వున్నారని సర్వే వెల్లడించింది. ఇటీవల ప్రపంచ దేశాల్లో భారత్ మరింత ప్రభావ వంతంగా మారిందని పది మందిలో ఏడుగురు భారతీయులు విశ్వసిస్తున్నట్టు సర్వేల్లో వెల్లడైందన్నారు.

author-image
By G Ramu
New Update

ప్రపంచ వ్యాప్తంగా వున్న 24 దేశాల్లో పీఈడబ్ల్యూ సర్వే నిర్వహించింది. మొత్తం 30,861 మంది నుంచి అభిప్రాయాలను సంస్థ సేకరించింది. అందులో 2,611 మంది భారతీయులు వున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భారత్ పై సానుకూల ధోరణితో వున్నట్టు సర్వే ద్వారా తెలిసింది. ప్రపంచంలో 46 శాతం మంది భారత్ పట్ల సానుకూలంగా వున్నారని, 36 శాతం మంది ప్రతికూల అభిప్రాయాన్నికలిగి వున్నారని సర్వే వెల్లడించింది.

also read: ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం..!!

మరో 16 శాతం మంది ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రపంచలో ఇజ్రాయిల్ దేశం భారత్ పట్ల అత్యంత పాజిటివ్ ఒపినియన్ కలిగి వుందని పేర్కొంది. ఆ దేశంలో సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది భారత్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ వెల్లడించారని తెలిపింది. ప్రతి పది మందిలో ఎనిమిది మంది భారతీయులు మోడీ పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

also read: విక్రమ్ ల్యాండర్ ఫోటో తీసిన రోవర్…. మరిన్ని ఫోటోలు షేర్ చేసిన ఇస్రో….!

అందులో మెజారిటీ (55 శాతం) ప్రజలు ప్రధాని మోడీ పట్ల "చాలా అనుకూలమైన" అభిప్రాయంతో ఉన్నారని వివరించింది. హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్న మోడీ పట్ల కేవలం 5 శాతం మంది మాత్రమే వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగివున్నట్టు స్పష్టం చేసింది. భారత్ శక్తివంతమైన దేశంగా తయారవుతోందని భారతీయులు విశ్వసిస్తున్నట్టు సర్వే పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు