Hyderabad: అప్పు తీర్చలేదని..80 లక్షల కారును తగలెట్టేశారు

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా 80 లక్షల విలువ చేసే లంబోర్ఘిని కారును తగలెట్టేశారు. హైదరాబాద్‌లోని పహాడీఫరీష్‌లో జరిగిందీ సంఘటన. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Hyderabad: అప్పు తీర్చలేదని..80 లక్షల కారును తగలెట్టేశారు

Lamborghini Car Burnt In Hyderabad: నార్సింగ్ కు చెందిన నీరజ్ అనే వ్యాపారికి లండోర్ఘిని కారంటే విపరీతమైన ఇష్టం. ఈ కారు చాలా కాస్ట్లీ ఉంటుందతి. జర్మనీకి చెందిన దీనిని కొత్తగా కొనాలంటే కోరట్ఉ పెట్టాల్సిందే. అయితే నీరజ్ తన మోజు తీర్చుకోవడానికి 2009 మాడల్కి చెందిన డిఎల్ 09 సివి 3636 నెంబర్ గల లంబోర్ఘిని స్పోర్ట్స్ కారు ను (Lamborghini Sports Car) సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేశాడు. 80 లక్షలు పెట్టి దీన్ని పర్చేజ్ చేశాడు. కొంతకాలం వాడుకుని సరదా తీరుగానే అమ్మేద్దామనుకున్నాడు. ఈ విషయాన్నే తెలిసిన వ్యక్తి అయిన అయాన్ కు చెప్పాడు. అయాన్ ఈవిషయాన్ని తన మరో స్నేహితుడైన మొఘల్పురాకు చెందిన అమన్ కు చెప్పాడు. కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమన్ కు, అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. అయితే కారును పార్టీ చూడాలనుకుంటోంది అని..దాని కోసం మామిడిపల్లి టు శంషాబాద్ రూట్ కు వెళ్లే రహదారిలో ఉన్న ఫాం హౌజ్ కు తీసుకురావాలని అహ్మద్ చెప్పాడు. దాంతో నీరజ్ దగ్గర కారుతీసుకుని అమన్ అతని స్నేహితుడు హందాన్ తో కలిసి రిసార్ట్‌కు వెళుతూ మధ్యలో జల్పల్లిలో వివేకానంద స్టాచ్ దాటి ఎయిర్ పోర్ట్ రూట్ మధ్యలో ఆపారు.

నీరజ్ ఎక్కడంటూ వచ్చి కారును తగలెట్టారు..
అయితే అక్కడ వారు ఆగిన చోటకు అహ్మద్ మరికొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చే నీరజ్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అతను మాకు డబ్బులు ఇవ్వాలంటూ అమన్, అతని ఫ్రెండ్‌ను తిట్టారు. అమన్ వాళ్ళు నీరజ్‌ను పలిపిస్తామనిచెప్పినా వినకుండా కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. దీంతో అమన్ వెంటనే 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పహాడిషరీఫ్ పోలీసులు, ఫైయిర్ ఇంజన్ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్దమయ్యింది. ఘటనా స్థిలికిచేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి కేసును నమోదు చేసుకున్నారు. నీరజ్ అప్పు ఎగ్గొట్టడం వల్లనే ఇలా చేశారా? ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Bhadrachalam: అయోధ్య రాముడు నడయాడిన తెలుగు నేల భద్రాచలం

Advertisment
Advertisment
తాజా కథనాలు