పొద్దున్నే మొలకలు తింటున్నారా.. అయితే ఈ 8 విషయాలు తెలుసుకోండి

శనిగలు, పెసరా, బీన్స్ తదితర విత్తనాల మొలకలు ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ 'కే' పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు వీటిని తినడం వల్ల 8 రకాల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యులు.

New Update
పొద్దున్నే మొలకలు తింటున్నారా.. అయితే ఈ 8 విషయాలు తెలుసుకోండి

శనిగలు, పెసరా, బీన్స్ తదితర విత్తనాల మొలకలు ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ 'ఎ, విటమిన్ 'సి, విటమిన్ 'బి' 1, విటమిన్ బి 6, విటమిన్ 'కే'లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీస్, కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మొలకల్లో ఉండే పీచు, ఫోలేట్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు బలమైన కండర పుష్టిని అందిస్తాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం చిరుతిండిగా మొలకెత్తిన గింజలు, ధాన్యాలను తినడం అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల 8 రకాల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు. మరి అవేంటో  తెలుసుకుందాం.

1. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:
మొలకల్లో అధికంగా ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తాన్ని శుభ్రపరచడంలో ఎంతో మెరుగ్గా పనిచేస్తాయి. ఐరన్, కాపర్, మాంగనీస్ పొటాషియం రెడ్ బ్లడ్ సెల్స్ ను ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. బ్లడ్ ఫ్లో ను కూడా ప్రమోట్ చేయడానికి సహకరిస్తాయి. ఇది వైట్ బ్లడ్ సెల్స్ కు కూడా కావాల్సిన సపోర్ట్ అందిస్తాయి. ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరిగి, జబ్బులబారిన పడినపుడు ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటాయి.

2. జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి :
మొలకలు జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తాయి. వీటిలో పీచు పదార్థంతో పాటు జీర్ణక్రియకు మద్దతు ఇచ్చే ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. మొలకలలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి, సాధారణ ప్రేగు కదలికలకు తోడ్పడుతుంది. మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు. మొలకల్లో పెసర, శనగలు, బీన్స్, బటానీలలో పుష్కలంగా ఉంటాయి.

3. రోగనిరోధక శక్తి పెంచుతుంది :
మొలకల్లో లభించే విటమిన్ 'సి' మన శరీరంలోని తెల్ల రక్త కణాల ఇన్ఫెక్షన్స్ రాకుండా, వాటితో పోరాడే సామర్థ్యాన్ని సమర్ధవంతంగా పెంచుతాయి. ఐరన్, కాపర్, మాంగనీస్ పొటాషియం కూడా సమృద్ధిగా ఉన్నందున్న రెడ్ బ్లడ్ సెల్స్ ను ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ ఫ్లోను కూడా ప్రమోట్ చేయడంలో మెరుగ్గా పనిచస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెంచడంలో సహాయపడతాయి.

4. కంటి చూపుకు అద్భుత ఔషధాలు:
మొలకలను ప్రతిరోజు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వీటిలో కీలకమైన విటమిన్లు A,Eలతో సహా కంటి ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కళ్లను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Also Read : సంతానలేమికి ఇది కూడా ఓ కారణమే.. పరిశోధనల్లో వెల్లడి

5. జుట్టు చుండ్రునుంచి రక్షణ
వీటిలో ఉండే సెలీనియం తలపై ఏర్పడే శిలీంధ్రాలతో పోరాడుతుంది. చుండ్రు ఇతర సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. విటమిన్ సి ఫ్రీరాడికల్స్ ను నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బట్టతల ఉన్నవారు డైలీ తినడం మూలంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

6. మొటిమలను తగ్గిస్తాయి :
మొలకల్లో ఉండే పోషకాలు మన చర్మానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. ఇవి రక్తప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చెడు రక్తం మూలంగానే మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఈ మొలకలు తినడం వల్ల చెడు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

7. జుట్టు పెరుగుదల:
మొలకలు జుట్టుకు సంబంధించి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి తినడం మూలానా పుష్కలమైన పొషకాలు అంది , తలలో రక్తం ప్రవాహం బాగా జరిగి వెంట్రుకల ఫోలికల్స్‌కు పోషకాల సరఫరా జరిగి, అవి దృఢంగా మారతాయి. కాబట్టి జుట్టురాలడం తగ్గుతుంది.

8. ఎక్కువకాలం యవ్వనంగా ఉంచుతాయి :
మొలకల్లో విటమిన్ ఎ, విటమిన్ 'సి'తోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. దీంతో చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి ప్రతిరోజు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పుష్కలమైన పొషకాలు మీ చర్మానికి అరోగ్యాన్ని అందిస్తాయి. మెరిసే చర్మానికి ఇవి తోడ్పడతాయి. మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఎక్కువకాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు