ఎన్నికల ప్రకటన తర్వాత..డైలమాలో పడ్డ బ్రిటన్ ప్రధాని..! By Durga Rao 27 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇద్దరు ప్రధానులు రాజీనామా చేయడం, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన వాతావరణంలో ఉన్న 2022 సమయంలో రిషి సునక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.అప్పటి నుంచి ఆయన తీసుకున్న పలు చర్యల వల్ల బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగుపడింది. అయితే పరిస్థితి పూర్తిగా సద్దుమణిగకపోవడంతో దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత బ్రిటిష్ పార్లమెంట్ వచ్చే ఏడాది ప్రారంభంలో ముగియనుంది. అంటే వచ్చే ఏడాది వరకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. అయితే రిషి సునక్ మాత్రం పార్లమెంటును ముందస్తుగా రద్దు చేసి ఎన్నికలను ప్రకటించారు. జులై 4న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని రిషి సునక్ ప్రకటించినప్పటి నుంచి పలు సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రకటనతో అనంతరం ప్రధాన మంత్రి రిషి సునక్ జోరుగా ప్రచారాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే ఎన్నికల ప్రకటన వెలువడిన మొదటి వారంలోనే ఆయన తన సలహాదారుతో రహస్యంగా సమావేశమయ్యారు. అక్కడి అసాధారణ వాతావరణమే ఇందుకు కారణం. అదేంటంటే.. ఎన్నికల ప్రకటన వెలువడగానే ఆ దేశ పార్లమెంట్‌కు పలువురు ఎంపీలు రాజీనామా చేశారు. అలాగే ఎన్నికల్లో పోటిచేసేందుకు తమకు సీట్లు అక్కర్లేదని పలువురు అంటున్నారు. బ్రిటన్‌లోని ఆర్థిక పరిస్థితి పలు కారణాల వల్ల రిషి సునక్ పై అతడి పార్టీ పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేల్లో రిషి సునక్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో సీనియర్ ఎంపీలు, మంత్రులు కూడా సీట్లు వద్దు అంటూ పారిపోతున్నారు. రిషి సునక్ మాజీ క్యాబినెట్ సభ్యులు మైఖేల్ గోవ్ , ఆండ్రియా లిట్సామ్ కూడా తమకు సీట్లు అక్కర్లేదని ప్రకటించారు. ఇప్పటివరకు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన దాదాపు 78 మంది తమకు సీట్లు అక్కర్లేదని ప్రకటించారు. చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఎన్నికల నుండి వైదొలగడంతో రిషి సునక్ డైలమాలో పడ్డారు. పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటమి ఖాయమైనప్పటికీ, కన్జర్వేటివ్ పార్టీ మద్దతుదారులకు ఇది గౌరవప్రదమైన ఓటమి. అయితే ప్రస్తుత సర్వేలను బట్టి చూస్తే ఘోర పరాజయం తప్పదని అంచనా. ఈ సర్వే ఫలితాలతో కలత చెందిన రిషి సునక్ ప్రచారానికి దూరంగా ఉండిపోయారు.అదే సమయంలో, ప్రతిపక్ష లేబర్ పార్టీ అక్కడ జోరుగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బ్రిటన్‌లో లేబర్ పార్టీ చివరిసారి 2005లో విజయం సాధించింది. అప్పటి నుంచి అక్కడ కన్జర్వేటివ్ పార్టీ వరుసగా గెలుపొందడంతో ఇప్పుడు ప్రభుత్వం మారే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేల్లో లేబర్ పార్టీకి 44%, కన్జర్వేటివ్ పార్టీకి 22% మద్దతు లభించడం గమనార్హం. #rishi-sunak మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి