Telangana : ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య

తెలంగాణలో బుధవారం ఇంటర్ ఫలితాలు వెల్లడికాగా.. తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసకోవడం కలకలం రేపింది. మరో విద్యార్థిని ఫెయిలవుతానననే భయంతో ఫలితాలకు ముందే బలవన్మరణానికి పాల్పడింది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Inter Students : తెలంగాణ(Telangana) లో బుధవారం ఇంటర్ ఫలితాలు(Inter Results) వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య(Suicide) చేసకోవడం కలకలం రేపింది. మరో విద్యార్థిని ఫెయిలవుతానననే భయంతో ఫలితాలకు ముందే బలవన్మరణానికి పాల్పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్‌ అత్తాపూర్‌కు చెందిన హరిణి, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం అచ్చులాపూర్‌ గ్రామానికి చెందిన మైదం సాత్విక్‌.. వీళ్లందరూ కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Also Read: తెలంగాణ టెన్త్‌ రిజల్ట్స్‌ ఎప్పుడంటే..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

ఇక సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పతూరు గ్రామానికి చెందిన శ్రీజ అనే ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని.. ఫెయిలవుతాననే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కానీ పరీక్ష ఫలితాలు చూస్తే ఆమె పాసైంది. ఇంటర్ ఫలితాల వల్ల రాష్ట్రంలో ఇలా ఏడుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడంటతో వాళ్ల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చారు.

Also read: నెత్తురోడిన తెలంగాణ.. సూర్యాపేటలో 6, వరంగల్ లో నలుగురు..

Advertisment
Advertisment
తాజా కథనాలు