Trust Of Nation Survey : మళ్ళీ మోదీ ప్రభుత్వాన్నే కోరుకుంటున్న ప్రజలు..ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వే ప్రస్తుతం దేశంలో ప్రధాని మోదీ హవా నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఇది మరింత ఎక్కువ అవుతోంది. దేశ ప్రధానిగా మళ్ళీ మోదీనే రావాలని ఏకంగా 61శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వే చెబుతోంది. By Manogna alamuru 16 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Modi Government : ప్రధాని మోదీ(PM Modi) కి పాలన మీద దేశంలో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే చాలా సర్వేల్లో ఈ విషయం బటయపడింది. ఇప్పుడు ట్రస్ట్ ఆఫ్ నేషన్(Trust Of Nation) నిర్వహించిన సర్వేలో కూడా ఈ విషయం వెల్లడైంది. మోదీనే మళ్ళీ ప్రధాని కవాలని దేశంలో 61 శాతం మంది ప్రజలులు కోరుకుంటున్నారని సర్వే చెబుతోంది. ప్రతి ఐదుగురులో ముగ్గురు మోదీ ప్రధానిగా కొనసాగడానికి అనుకూలంగా ఉన్నారు. ఇలా కోరుకునేవాళ్ళ శాతం 64గా ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధానిగా ఉంటే బాగుంటుందని 21.8%మంతి కోరుకుంటున్నారు. ఇంగ్లీష్, మిందీ, ఇంకా కీలక ప్రాంతీయ భాషలు అన్నీ కలిపి మొత్తం 11 భాషల్లో డైలీ హంట్ ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వేను నిర్వహించింది. ఇందులో మొత్తం 77 లక్సల మంది ప్రజలు పాల్గొన్నారు. సర్వే వివరాలు ఇలా ఉన్నాయి... --ప్రతి ముగ్గురిలో దాదాపు ఇద్దరు (63%) రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP) లేదా ఎన్డీయే(NDA) కూటమి గెలుస్తుందని నమ్ముతున్నారు. -- ఢిల్లీలో ప్రధాని మోదీ 57.7% ఓట్లతో అగ్రగామిగా నిలిచారు. రాహుల్ గాంధీకి 24.2% ఓట్లు రాగా, యోగి ఆదిత్యనాథ్‌కి 13.7% ఓట్లు వచ్చాయి. --ఉత్తరప్రదేశ్‌లో, ఈ ఏడాది ఎన్నికలలో ప్రధానమంత్రి మోదీ 78.2% ఓట్లను సాధించి అగ్రగామిగా నిలిచారు. రాహుల్ గాంధీకి 10% ఓట్లు వచ్చాయి . --పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ 62.6% ఓట్లతో అగ్రగామిగా నిలిచారు. రాహుల్ గాంధీకి 19.6% ఓట్లు రాగా, ప్రాంతీయ నేత మమతా బెనర్జీకి 14.8% ఓట్లు వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ... --తమిళనాడులో రాహుల్ గాంధీ 44.1% మద్దతుతో ఆధిక్యంలో ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ 43.2% వద్ద వెనుకంజలో ఉన్నారు. --కేరళలో మాత్రం గట్టి పోటీ కనిపిస్తోంది. ప్రధాని మోదీకి 40.8%, రాహుల్ గాంధీకి 40.5% ఓట్లు వచ్చాయి. --తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీకి 60.1% ఓట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ 26.5% పొందగా, --ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీకి 71.8 శాతం ఓట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ 17.9% పొందగా, చంద్రబాబు నాయుడు 7.4% వెనుకబడి ఉన్నారు. Also Read : శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్ డేట్స్ వచ్చేశాయి..! మోదీ పాలన మీద సంతృప్తి... దేశ ప్రజల్లో చాలా మంది మోదీ పాలన మీద సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని ఆర్ధికంగా, సామాజికంగా పురోగతి చెందడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారని వీరు నమ్ముతున్నారు. మొత్తం 61%మంది ప్రజలు మోదీ పాలన కొనసాగిస్తేనే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..21శాతం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతృప్తి వ్యక్తం చేసిన వారిలో సగానికి పైగా అంటే 53.3% మంది మోడీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను 'చాలా బాగుంది' అని రేట్ చేయగా, 20.9% మంది అది 'మెరుగైనది' అని అభిప్రాయపడ్డారు. దాంతో పాటూ ప్రతి పది మందిలో ఆరుగురు అంటే 60% మంది ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక పురోగతి పట్ల తాము 'చాలా సంతోషంగా' ఉన్నామని పేర్కొన్నారు.పశ్చిమ, తూర్పు మరియు ఉత్తర ప్రాంతాలలో, 63% మంది ప్రజలు దేశ ఆర్థిక పురోగతిపై సంతృప్తి చెందారు. దక్షిణాదిలో 55% మంది మాత్రమే దీనిని ఆమోదించారు.ఇక సర్వేలో సగానికి పైగా అంటే 52.6% ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల పట్ల తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేయగా, 28.1% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాంగ విధానం... మోదీ, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం మీద కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానని(India) ప్రపంచ దేశాలతో సమానంగా నిలబెట్టడానికి మోదీ ప్రభుత్వం కృష్ఇ చేసిందని నమ్మతున్నారు. దాదాపు మూడింట రెండు వంతుల మంది (64%) మోదీ ప్రభుత్వం విదేశీ వ్యవహారాల నిర్వహణకు 'చాలా మంచి' రేటింగ్ ఇచ్చారు. అయితే 14.5% మంది 'మంచిది' అని మాత్రమే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంక్షోభ నిర్వహణ.. సర్వేలో అత్యధికంగా ప్రజలు..త్యవసర సమయంలో ప్రధాని మోదీ అందించిన నాయకత్వం పట్ల గొప్ప ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే 20.5% మంది బాగుంది అని..10.7% మంది తటస్థంగా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు.. ప్రతివాదులలో సగానికి పైగా (53.8%) కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల గణనీయమైన సంతృప్తిని వ్యక్తం చేయగా, 24.9% మంది అసంతృప్తిగా ఉన్నారు #pm-modi #india #trust-of-natiion-survey #daily-hunt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి