Leaves For Diabetes : ఈ ఆహారాలతో షుగర్‌కు చెక్.. అవేంటో తెలుసుకోండి ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి అనేది అందరిని వేధిస్తున్న సమస్య. ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి మునగాకులు, జామాకులు, కరివేపాకు, మెంతాకులు, తులసి ఆకులు ఉపయోగపడచ్చు. ఇవి రోజూ తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండే ఛాన్స్ ఉంది By Vijaya Nimma 25 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Leaves to Control Diabetes: ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి అనేది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. అంతే కాకుండా ఈ షుగర్ వ్యాధి నుంచి బాధపడే వారి సంఖ్య రోజుకు పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెబుతున్నారు. షుగర్ వ్యాధి వల్ల కలిగే ఇబ్బందులు అంతా ఇంతా కావనే చెప్పాలి. రక్తంలో చక్కెర స్థాయినాలు అధికంగా ఉండటం వలన శరీరంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కంపల్సరిగా మందులు వాడాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలలు పెరిగి అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా చక్కెర స్థాయిలను అదుపు చేసే ఆహారం కూడా తీసుకుంటే చాలా మంచిది. దీని వలన షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఇది కూడా చదవండి: పెరుగుతో ఆరోగ్యమే కాదు అందం కూడా.. ఎలానో తెలుసుకోండి! అయితే.. ఈ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు రకరకాల ఆకులు మనకు ఎంతో ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధిని అదుపు చేసేందుకు ఇవి బాగా పనిచేసి షుగర్ వ్యాధిని పెంచకుండా ఉంచేందుకు ఈ ఆకులు తోడ్పడుతున్నాయి. అయితే షుగర్ వ్యాధితో బాధపడేవారు ఈ ఆకుల్ని తింటే మంచి ఫలితం ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎలాంటి ఆకులు తీసుకోవాలో.. దానివల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ ఆకులతో ఇలా చేయండి మునగాకులు: ఈ మునగాకును రోజు తీసుకుంటే షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసి భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని వైద్యులు అంటున్నారు కరివేపాకు: షుగర్‌ని కంట్రోల్ చేయడంలో కరివేపాకు కూడా ఒకటి. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తుంది. జామాకులు: జామ ఆకులు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. వీటిని తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ వంటి సమస్యలు తక్కువగా వస్తాయని చెబుతున్నారు. మెంతాకులు: షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతిఆకులు మంచి ఫలితం ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది తులసి ఆకులు: షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచడంలో తులసి బాగా పనిచేస్తుంది. దీనిని రోజు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఉంటాయి.. షుగర్ ప్రారంభ దశలో ఉంటే తులసి ఆకులను తింటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. #health-benefits #diabetes-control-tips #leaves-for-diabetes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి